‘తల్లికి వందనం’ కోసం రూ.566.15 కోట్లు
ABN , Publish Date - Jul 23 , 2026 | 11:51 PM
తల్లికి వందనం పథకం కోసం ప్రభుత్వం రూ.566.15 కోట్లు విడుదల చేసింది. ఒకే కుటుం బంలో ఐదుగురి దాకా పిల్లలకు డబ్బు జమ అవు తుండటంతో ఆ కుటుంబంలో పండుగ వాతావ రణం కనిపిస్తున్నది.
అర్హులైన విద్యార్థులు 4,35,499
తల్లులు 2,81,149 మంది
కర్నూలు ఎడ్యుకేషన్, జూలై 23 (ఆంధ్ర జ్యోతి): తల్లికి వందనం పథకం కోసం ప్రభుత్వం రూ.566.15 కోట్లు విడుదల చేసింది. ఒకే కుటుం బంలో ఐదుగురి దాకా పిల్లలకు డబ్బు జమ అవు తుండటంతో ఆ కుటుంబంలో పండుగ వాతావ రణం కనిపిస్తున్నది. కర్నూలు జిల్లాలో అన్ని ప్రభు త్వ, ప్రైవేటు యాజమాన్య పాఠశాలలో అర్హులైన విద్యార్థుల సంఖ్య మొత్తం, 4,35,499. వీరికి రూ.566.15 కోట్ల నిధులు 2,81,149 మంది తల్లుల ఖాతాలో జమ అయ్యాయి. కుటుంబంలో ఎంత మంది పిల్లలున్నా అందరికీ సహాయాన్ని మంజూరు చేసింది. ఒక్కో విద్యార్థికి చెల్లించే రూ.15వేల నుంచి రూ.2వేల చొప్పున మినహాయించి మిగతా రూ.13వేలు జమ చేస్తుంది. బ్యాంకు, ఫోస్టాఫీసు ఖాతాలో జమ అయిన నిధులను డ్రా చేసుకునేందుకు క్యూ కట్టారు.
కర్నూలు మెయిన్ పోస్టాఫీసు వద్ద కిటకిట
కర్నూలు న్యూసిటీ, జూలై 23(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం తల్లికి వందనం డబ్బులను తల్లుల ఖాతాలో జమ చేసింది. దీంతో కర్నూలు జిల్లాలోని బ్యాంకులు, పోస్టాఫీసుల వద్ద తల్లులు తమ ఖాతాలో ఉన్న తల్లికి వందనం డబ్బులు విత్‌డ్రా చేసు కునేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కర్నూలు నగరంలోని ప్రధాన తపాలా కార్యాలయం వద్ద పెద్దఎత్తున తల్లులు డబ్బులు విత్‌డ్రా చేసుకునేందుకు ఉదయం నుంచి వేచి ఉన్నారు. ఎక్కువ మంది ఒక్కసారిగా రావడంతో పోస్టాఫీసు లబ్ధిదారులతో కిక్కిరిసిపోయింది. డబ్బులు విత్ డ్రా చేసుకునేందుకు గంటకు పైగా సమయం పట్టిందని మహిళలు తెలిపారు.