ఆర్యవైశ్య మహాసభ భవన నిర్మాణానికి మరో రూ.50 లక్షలు
ABN , Publish Date - Mar 30 , 2026 | 11:48 PM
విజయవాడలో నూతనంగా నిర్మిస్తున్న ఆర్యవైశ్య మహాసభ భవనానికి రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ టీజీవీ సంస్థల నుంచి రూ.50 లక్షల చెక్కును సోమవారం ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు ఇల్లూరు లక్ష్మయ్యకు అందజేశారు.
టీజీవీ సంస్థల నుంచి మొత్తం రూ.కోటి అందజేత
కర్నూలు కల్చరల్, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): విజయవాడలో నూతనంగా నిర్మిస్తున్న ఆర్యవైశ్య మహాసభ భవనానికి రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ టీజీవీ సంస్థల నుంచి రూ.50 లక్షల చెక్కును సోమవారం ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు ఇల్లూరు లక్ష్మయ్యకు అందజేశారు. నగరంలోని మౌర్యఇన్‌లో గల మంత్రి కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి టీజీ భరత్ ఈ విరాళాన్ని చెక్కుల రూపంలో అందజేశారు. ఇల్లూరు లక్ష్మయ్య మాట్లాడుతూ గతంలో కూడా ఈ భవన నిర్మాణానికి రూ.50 లక్షలు టీజీ భరత్ అందజేశారని, మొత్తం రూ. కోటి రూపాయాలు ఈ భవన నిర్మాణానికి టీజీవీ సంస్థల నుంచి ఇచ్చారని తెలిపారు. ఆర్యవైశ్య మహాసభ పురోభివృద్ధిలో రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేశ్, ఆయన తనయుడు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ ఎప్పుడూ అండగా ఉంటున్నారన్నారు. ఈ సందర్భంగా మంత్రి టీజీ భరత్‌కు వారు కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో ఏపీఐఐసీ డైరెక్టర్ జగదీష్ గుప్త, ఇల్లూరు తిరుపాల్ బాబు, టీడీపీ నాయకుడు సోమిశెట్టి నవీన్, మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ శేషగిరి, ఆర్యవైశ్య సంఘం నాయకులు నాగెళ్ల రాజగోపాల్, ఇల్లూరు సుధాకర్, వాయిగండ్ల సుబ్బారావు, విటల్ తదితరులు పాల్గొన్నారు.