హోంగార్డు కుటుంబాలకు రూ.4 లక్షలు
ABN , Publish Date - May 22 , 2026 | 12:03 AM
జిల్లా పోలీస్ కార్యాల యంలో హోంగార్డ్స్ కాంట్రిబ్యూషన ఫండ్ నుంచి మంజూరైన చెక్కులను హోంగార్డ్స్ సదరన రీజియన కమాండెంట్ ఎం. మహేష్ కుమార్ గురువారం బాధిత కుటుంబ సభ్యులకు అందజే శారు.
కర్నూలు క్రైం, మే 21(ఆంధ్రజ్యోతి): జిల్లా పోలీస్ కార్యాల యంలో హోంగార్డ్స్ కాంట్రిబ్యూషన ఫండ్ నుంచి మంజూరైన చెక్కులను హోంగార్డ్స్ సదరన రీజియన కమాండెంట్ ఎం. మహేష్ కుమార్ గురువారం బాధిత కుటుంబ సభ్యులకు అందజే శారు. కాంట్రిబ్యూషన ఫండ్ కింద మంజూరైన రూ.4లక్షల రెండు చెక్కులను వారికి అందజేశారు. ఆదోని యూనిట్ చెందిన హోం గార్డు వెంకటేశులు పదవీ విరమణ పొంది రిటైర్మెంట్ గ్రాంట్ కింద రూ.2 లక్షల చెక్కును, కర్నూలు యూనిట్ చెందిన హోం గార్డు కృష్ణ మృతి చెందడంతో అతని భార్య సునీతకు మరణా నంతర సాయంగా రూ.2లక్షల చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో హోంగార్డు ఆర్‌ఐ పోతుల రాజు, ఏఆర్ ఎస్‌ఐలు కాంతరెడ్డి, ఎం.మహేశ్వరయ్య, మల్లికార్జునరెడ్డి, పోలీసు సిబ్బంది హోంగార్డులు పాల్గొన్నారు.