Share News

గేట్ల మరమ్మతులకు రూ.18.30 లక్షలు

ABN , Publish Date - Jul 25 , 2026 | 11:56 PM

రాజోలి ఆనకట్ట వద్ద కుందూ గేట్ల మరమ్మతులకు రూ.18.30లక్షల నిధులు మంజూరైనట్లు కేసీ కెనాల్‌ డీఈ పుల్లయ్య, ఏఈ జమాల్‌వలి తెలిపారు. శనివారం ఆనకట్ట వద్ద దెబ్బతిన్న గేట్లను పరిశీలించారు.

గేట్ల మరమ్మతులకు రూ.18.30 లక్షలు
రాజోలి ఆనకట్ట వద్ద దెబ్బతిన్న గేట్లను పరిశీలిస్తున్న డీఈ, ఏఈ

చాగలమర్రి, జూలై 25 (ఆంధ్రజ్యోతి): రాజోలి ఆనకట్ట వద్ద కుందూ గేట్ల మరమ్మతులకు రూ.18.30లక్షల నిధులు మంజూరైనట్లు కేసీ కెనాల్‌ డీఈ పుల్లయ్య, ఏఈ జమాల్‌వలి తెలిపారు. శనివారం ఆనకట్ట వద్ద దెబ్బతిన్న గేట్లను పరిశీలించారు. వారు మాట్లాడుతూ గేట్లు మరమ్మతులు చేసేందుకు టెండర్లు కూడా వేశారన్నారు. కాంట్రాక్టర్‌ అగ్రిమెంట్‌ చేయిం చుకోకపోవడంతో మరమ్మతు పనులు జాప్యం జరుగుతుందన్నారు. కుందూ దిగువకు నీరు మళ్లించేందుకు 6 గేట్లు ఉన్నాయని, ఇందులో 3 గేట్లు తుప్పు పట్టి దెబ్బతిన్నాయన్నారు. ఆనకట్టకు వరద వచ్చిన సమయంలో గేట్లు ఎత్తేందుకు లస్కర్లు ఇబ్బంది పడుతున్నారన్నారు. టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి త్వరలో పనులు కూడా చేపడతామన్నారు. వారివెంట సూపర్‌వైజర్‌ దస్తగిరి, లస్కర్లు ఉన్నారు.

Updated Date - Jul 25 , 2026 | 11:56 PM