ఉరుకుంద ఈరన్నకు రూ.1.41 కోట్లు
ABN , Publish Date - Sep 01 , 2026 | 10:58 PM
మండలంలోని ఉరుకుంద ఈరన్న స్వామి దేవస్థానంలో స్వామి వారికి భక్తులు సమర్పించిన కానుకల హుండీని దేవస్థానపు కాలక్షేపపు మండపంలో మంగళవారం ఆలయ డిప్యూటీ కమిషనర్, ఈవో వాణి, పాలక మండలి సభ్యు ల ఆధ్వర్యంలో చేపట్టారు.
శ్రావణ మాస వేడుకల్లో హుండీ ఆదాయం
కౌతాళం, సెప్టెంబరు,01(ఆంధ్రజ్యోతి): మండలంలోని ఉరుకుంద ఈరన్న స్వామి దేవస్థానంలో స్వామి వారికి భక్తులు సమర్పించిన కానుకల హుండీని దేవస్థానపు కాలక్షేపపు మండపంలో మంగళవారం ఆలయ డిప్యూటీ కమిషనర్, ఈవో వాణి, పాలక మండలి సభ్యు ల ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ శ్రావ ణ మాసంలో భక్తులు స్వామివారికి సమర్పించిన కానుకల్లో నగదు రూపంలో రూ.1,41,05,560, బంగారం 16.980 గ్రాములు, వెండి 25.300 కిలోలు, 8 యు.ఎస్ డాలర్లు వచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆల య పాలకమండలి హుండీ పర్యవేక్షణ అధికారి కమలాకర్, ఆలయ అధికారులు మల్లికార్జున, వెంకటేశ్వరరావు, దేవాలయపు ప్రధాన, ఉప అర్చకులు ఈరప్ప స్వామి, మహదేవప్ప పాల్గొన్నారు.