Share News

మార్కెట్‌ యార్డు అభివృద్ధికి రూ.1.34 కోట్లు

ABN , Publish Date - Jul 21 , 2026 | 11:27 PM

నంద్యాల టెక్కె మార్కెట్‌యార్డులో రూ.1.34 కోట్లతో పలు అభివృద్ధి పనులు చేపట్టినట్లు మార్కెట్‌యార్డు చైర్మన్‌ గుంటుపల్లి హరిబాబు తెలిపారు.

మార్కెట్‌ యార్డు అభివృద్ధికి రూ.1.34 కోట్లు
మాట్లాడుతున్న గుంటుపల్లి హరిబాబు

రైతుబంధు పథకం పునరుద్ధరణ

నంద్యాల మార్కెట్‌ యార్డు చైర్మన్‌ గుంటుపల్లి హరిబాబు

నంద్యాల ఎడ్యుకేషన్‌, జూలై 21 (ఆంధ్రజ్యోతి) : నంద్యాల టెక్కె మార్కెట్‌యార్డులో రూ.1.34 కోట్లతో పలు అభివృద్ధి పనులు చేపట్టినట్లు మార్కెట్‌యార్డు చైర్మన్‌ గుంటుపల్లి హరిబాబు తెలిపారు. మార్కెట్‌ యార్డులో మంగళవారం పాలకమండలి సమావేశం అనంతరం ఛైర్మన్‌ మాట్లాడుతూ గత 20 యేళ్లలో చేయని అభివృద్ధి కేవలం ఒక్క సంవత్సరం లోనే చేపడుతున్నట్లు వివరించారు. మార్కెట్‌యార్డు కాంపౌండ్‌ నిర్మాణానికి రూ.10లక్షలు, కార్యాలయ రెనోవేషన్‌ పనులకు రూ.10లక్షలు, రెండు షెడ్ల మరమ్మతులకు రూ.37 లక్షలు, మార్కెట్‌యార్డులో సీసీ రోడ్డు నిర్మాణానికి రూ.27లక్షలు, నూతనంగా తొమ్మిది షాపుల నిర్మాణానికి రూ.50లక్షలు మం జూరై పనులు జరుగుతున్నాయన్నారు. మరో రూ.8.50 కోట్లతో పలు అభి వృద్ధి పనులకు ప్రతిపాదనలు పంపించినట్లు తెలిపారు. రైతుబంధు పథ కాన్ని పునరుద్ధరించడంతో, దాని కింద మార్కెట్‌ యార్డుకు రూ.2కోట్లు మం జూరయ్యాయని అన్నారు. ఈ సమావేశంలో మార్కెట్‌యార్డు వైస్‌ ఛైర్మన్‌ దియ్యాల రంగప్రసాద్‌, ఏడీ రహెమాన్‌, కార్యదర్శి కృష్ణనాయక్‌ పాల్గొన్నారు.

Updated Date - Jul 21 , 2026 | 11:27 PM