Share News

వార్డుల అభివృద్ధికి రూ.116 కోట్లు

ABN , Publish Date - Oct 04 , 2026 | 12:16 AM

కల్లూరు అర్బన 16 వార్డుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం రూ.116 కోట్లు మంజూరు చేసిందని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు.

వార్డుల అభివృద్ధికి రూ.116 కోట్లు
మాట్లాడుతున్న ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి

పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి

కల్లూరు, అక్టోబరు 3(ఆంధ్రజ్యోతి): కల్లూరు అర్బన 16 వార్డుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం రూ.116 కోట్లు మంజూరు చేసిందని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు. శనివారం స్థానిక ఎస్‌బీఐ ఎంప్లాయీస్‌ కాలనీలోని నగర పాలక సంస్థ సమావేశ భవనంలో కమిషనర్‌ చల్లా ఓబులేసుతో కలిసి ఎమ్మెల్యే వార్డు నాయకులు, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. గౌరు చరితారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని నగరాలు, పట్టణాల్లో పరిష్కారానికి నోచుకోని దీర్ఘకాలిక సమస్యలకు శాశ్వత పరిస్కారం చూపే లక్ష్యంతో సీఎం చంద్రబాబు హ్యామ్‌ మోడల్‌ ద్వారా రూ.11,359 కోట్లతో మౌలిక వసతులు, అభివృద్ధికి శ్రీకారం చుట్టారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 123 మున్సిపా లిటీలు, కార్పొరేషన్ల పరిధిలో రూ.11, 359 కోట్ల విలువైన పనులు చేప ట్టనున్నట్లు వివరించారు. కల్లూరు అర్బన 16 వార్డుల్లో రూ.96.50 కోట్లతో 62.80 కిలోమీటర్ల మేర రహదారులు, రూ.13.70 కోట్లతో 14 పార్కుల అభివృద్ధి, రూ.5.80 కోట్లతో 8.50 కిలోమీటర్ల మేర సెంట్రల్‌ మీడియన పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. కమిషనర్‌ చల్లా ఓబులేసే మాట్లాడుతూ అభివృద్ధి చెందుతున్న వార్డులకు హ్యామ్‌ ఒక వరం లాం టిదన్నారు. నగరంలోని మూడు నియోజకవర్గాల పరిధిలోని 52 వార్డులకు రూ.150 కోట్ల నిధులతో అభివృద్ధి పనులకు చేపట్టను న్నామన్నారు. కార్యక్రమంలో ఏపీ విశ్వబ్రాహ్మణ కార్పొరేషన చైర్‌పర్సన కె.పార్వతమ్మ, ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన డైరెక్టర్‌ ఎస్‌కే.శ్రీనివాసరావు, అర్బన వార్డుల కన్వీనర్‌ పి. పురుషోత్తంరెడ్డి, ఎస్‌ఈ రమణమూర్తి, ఎంఈ మనోహర్‌రెడ్డి, డీఈఈ పవనకుమార్‌రెడ్డి, నరేష్‌, కృష్ణలత, హేమలత, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Updated Date - Oct 04 , 2026 | 12:16 AM