ప్రజల రక్షణకు పటిష్ట భద్రత
ABN , Publish Date - Jul 04 , 2026 | 11:37 PM
ప్రజల రక్షణకు పటిష్ట భద్రత పోలీసు శాఖ కల్పిస్తుందని ఎస్పీ సునీల్ షెరాన్ అన్నారు.
ఎస్పీ సునీల్ షెరాన్
కమాండ్ కంట్రోల్ రూమ్ ప్రారంభం
డోన్ టౌన్, జూలై 4 (ఆంధ్రజ్యోతి): ప్రజల రక్షణకు పటిష్ట భద్రత పోలీసు శాఖ కల్పిస్తుందని ఎస్పీ సునీల్ షెరాన్ అన్నారు. శనివారం డోన్ పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన అత్యాధునిక 118 సీసీ కెమెరాలతో కూడిన కమాండ్ కంట్రోల్ రూంను ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డితో కలిసి ఎస్పీ ప్రారంభించారు. ముం దుగా డీఎస్పీ శ్రీనివాస్ ముఖ్యఅతిథులకు పుష్పగుచ్ఛం అందజేసి ఆహ్వా నించారు. ఎస్పీ మాట్లాడుతూ నేరాల నియంత్రణకు సీసీ కెమెరా లతో నిరంతర నిఘా ఉంచాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో వేగవంత మైన స్పందన అందించేందుకు ఇది ఎంతో దోహదపడుతుందన్నారు. ఎమ్మెల్యే కోట్ల మాట్లాడుతూ ప్రజలకు పారదర్శకమైన, జవాబుదారీతనంతో కూడిన సేవలు అందించేందుకు అవసరమైన చర్యలు చేపడుతోం దన్నారు. జిల్లాలోనే మొదటిసారిగా డోన్‌లో అత్యాధునిక టెక్నాలజీతో కలిగిన సీసీ కెమెరాల ఏర్పాటుకు కృషిచేసిన డీఎస్పీ శ్రీనివాస్‌ను ఎస్పీ, ఎమ్మెల్యే అభినందించారు. కార్యక్రమంలో సీఐలు ఇంతియాజ్ బాషా, సీఎం రాకేష్, వెంకట్రామిరెడ్డి, వెంకటేశ్వరరావు, ప్రవీణ్‌కుమార్, మంజునాథరెడ్డి, ఎస్‌ఐలు శరత్ కుమార్ రెడ్డి, మమత, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.