పటిష్ట భద్రత ఏర్పాట్లు
ABN , Publish Date - Oct 27 , 2026 | 11:15 PM
మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ పేర్కొన్నారు.
ఎస్పీ విక్రాంత్ పాటిల్
కర్నూలు క్రైం, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం వన్‌టౌన్ పోలీ్‌సస్టేషన్ పరిధిలోని నెహ్రూ మెమోరియల్ స్కూల్, ఉస్మానియా కళాశాల, పెద్దమార్కెట్ సమీపంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఉన్న సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలింగ్ కేంద్రాల్లో భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాల నిఘా, శాంతిభద్రతల పరీరక్షణకు తీసుకోవాల్సిన ముందస్తు చర్యలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగేలా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. వన్‌టౌన్ సీఐ మారుతి శంకర్, స్పెషల్ బ్రాంచ్ సీఐ మధుసూదన్‌రావు ఉన్నారు.