నగరాభివృద్ధికి రహదారులే కీలకం
ABN , Publish Date - Sep 02 , 2026 | 12:08 AM
నగరాభివృ ద్ధికి రహదారులే కీలకపాత్ర పోషిస్తాయని నగరపాలక సంస్థ కమి షనర్ చల్లా ఓబులేసు అన్నారు.
నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు
కర్నూలు న్యూసిటీ, సెప్టెంబరు 1(ఆంధ్రజ్యోతి): నగరాభివృ ద్ధికి రహదారులే కీలకపాత్ర పోషిస్తాయని నగరపాలక సంస్థ కమి షనర్ చల్లా ఓబులేసు అన్నారు. మంగళవారం ఆయన కొండారెడ్డి బురుజు వద్ద చేపడుతున్న బీటీ రోడ్డు రీ-సర్ఫేసింగ్ పనులను పరిశీలించారు. కమిషనర్ మాట్లాడుతూ కొండారెడ్డి బురుజు నుం చి కోట్ల విజయభాస్కర్‌రెడ్డి కూడలి, కిడ్స్ వరల్డ్, రాజ్‌విహార్ మీ దుగా వై.జంక్షన వరకు సుమారు 4కిలోమీటర్ల మేర రూ.2.23 కోట్ల వ్యయంతో బీటీ రోడ్డు రీ-సర్ఫేసింగ్ పనులు జరుగుతున్నాయన్నారు. వీటితోపాటు 14 కూడళ్లు, ప్రఽధాన రహదారుల వెంట అవసరమైన చోట్ల రూ.30 లక్షల నగర పాలక సంస్థ సాధారణ నిధులతో రోడ్ మార్కింగ్, సెంటర్ లైన్స, ఎడ్జ్ లైన్స, లేన లైన్స, జీబ్రా క్రాసింగ్స్, రం బుల్ సి్ట్రప్స్ వంటి సూచకాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగ్గా పాటించేలా చర్యలు తీసుకుం టామన్నారు. అనంతరం ప్రభుత్వ ఆస్పత్రిలోని అన్న క్యాంటీనను తనిఖీ చేశారు. కార్యక్రమంలో ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.