Share News

తారు.. తకరారు

ABN , Publish Date - May 06 , 2026 | 11:48 PM

తారు ధరలు పెరగడంతో రోడ్డు పనులు ఆగిపోయాయి. మండలంలోని ఆల్వకొండ క్రాస్‌ రోడ్డు నుంచి ఆకుమల్ల వరకు బీటి రోడ్డు నిర్మానానికి రూ.25లక్షలు విడుదలయ్యాయి. పనులు ప్రారంభించిన కాంట్రాక్టర్‌ గ్రావెల్‌ డస్ట్‌ వేశారు.

తారు.. తకరారు
కంకర వేసి వదిలేసిన రహదారి

ధర పెరగడంతో నిలిచిన బీటీ రోడ్డు పనులు

ఇబ్బందులు పడుతున్న వాహనదారులు

సంజామల, మే 6 (ఆంధ్రజ్యోతి): తారు ధరలు పెరగడంతో రోడ్డు పనులు ఆగిపోయాయి. మండలంలోని ఆల్వకొండ క్రాస్‌ రోడ్డు నుంచి ఆకుమల్ల వరకు బీటి రోడ్డు నిర్మానానికి రూ.25లక్షలు విడుదలయ్యాయి. పనులు ప్రారంభించిన కాంట్రాక్టర్‌ గ్రావెల్‌ డస్ట్‌ వేశారు. ఇరాన్‌-అమెరికా యుద్ధ ప్రభావంతో తారు ధరలు పెరగడంతో చేతులెత్తేశారు. కోవెలకుంట్ల నుంచి అవుకు మీదుగా తాడిపత్రికి ఇది ప్రధాన రహదారి కావడంతో నిత్యం వాహనాల రద్దీ అధికంగా ఉంటుంది. వాహనాలు వెళ్ళినప్పుడు దుమ్ము, ధూళితో వెళ్తున్న ద్విచక్ర వాహనదారులు, ప్రయాణీకులు అసౌకర్యానికి గురవుతున్నారు. రహదారిపై కంకర తేలడంతో ద్విచక్ర వాహనదారులు అదుపుతప్పి కిందపడుతున్నారు.

పనులను పూర్తి చేస్తాం

నిలిచిపోయిన బీటి రోడ్డు పనులను త్వరగా పూర్తి చేయిస్తాం. వారంలోపు పనులను ప్రారంభిస్తాం. ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకుంటాం. - రెడ్డి గోవిందు, ఆర్‌అండ్‌బీ డీఈ

Updated Date - May 06 , 2026 | 11:49 PM