Share News

రోడ్డు భద్రతా ప్రమాణాలు పాటించాలి

ABN , Publish Date - Jan 02 , 2026 | 11:32 PM

వాహన దారులు రోడ్డు భద్రతా ప్రమాణాలు తప్పనిసరిగా పా టించాలని నంద్యాల ఎంవీఐ రవిశంకర్‌ నాయక్‌ పేర్కొన్నారు

రోడ్డు భద్రతా ప్రమాణాలు పాటించాలి
మాట్లాడుతున్న ఎంవీఐ రవిశంకర్‌నాయక్‌

ఎంవీఐ రవిశంకర్‌నాయక్‌

నంద్యాల టౌన్‌, జనవరి 2(ఆంధ్రజ్యోతి): వాహన దారులు రోడ్డు భద్రతా ప్రమాణాలు తప్పనిసరిగా పా టించాలని నంద్యాల ఎంవీఐ రవిశంకర్‌ నాయక్‌ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక ఆర్టీసీ కార్యాలయంలో జాతీయ రహదారి మాసోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయనతో పాటు ఆర్‌ఎం రజియా సులా ్తనా, ట్రాఫిక్‌ సీఐ చాన్‌బాషా పాల్గొన్నారు. ఈ సంద ర్భంగా వారు మాట్లాడుతూ రాత్రి సమయంలో డ్రైవర్లు బస్సులు నడిపే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పారు. ఓవర్‌ స్పీడు వెళ్లి ప్రమాదాలు చేయవద్దని, ఫోన్‌ డ్రైవింగ్‌ చేయవద్దని, ప్రయాణికులతో మంచిగా ఉండాలని సూచించారు. ఆర్టీసీ డీఎం మాధవీలత, ఏడీఎం కిషోర్‌, డ్రైవర్లు సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Jan 02 , 2026 | 11:32 PM