Share News

దాహార్తి తీర్చేందుకే ఆర్వో ప్లాంట్లు

ABN , Publish Date - May 06 , 2026 | 12:14 AM

ప్రజల దాహార్తిని తీర్చడానికి బనగానపల్లె నియోజకవర్గంలో విస్తృతంగా మినరల్‌ వాటర్‌ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి బీసీ జనార్దన్‌ రెడ్డి పేర్కొన్నారు

దాహార్తి తీర్చేందుకే ఆర్వో ప్లాంట్లు
మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌ను ప్రారంభిస్తున్న మంత్రి

మంత్రి బీసీ జనార్దన్‌ రెడ్డి

కొలిమిగుండ్ల, మే 5 (ఆంధ్రజ్యోతి): ప్రజల దాహార్తిని తీర్చడానికి బనగానపల్లె నియోజకవర్గంలో విస్తృతంగా మినరల్‌ వాటర్‌ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి బీసీ జనార్దన్‌ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని పెట్నికోట, గోర్విమానుపల్లె గ్రామాలలో రూ.14లక్షలతో నిర్మించిన ఉచిత మినరల్‌ వాటర్‌ ప్లాంట్లను ప్రారంభించారు. అనంతరం అలా్ట్రటెక్‌ సిమెంట్‌ పరిశ్రమ సీఎస్‌ఆర్‌ నిధులతో నిర్మించిన అంగన్‌వాడీ భవనాన్ని ప్రారంభించారు. మూలే రామేశ్వర్‌ రెడ్డి, పులి ప్రకాష్‌ రెడ్డి, గొంకటి హుస్సేన్‌ రెడ్డి, అలా్ట్రటెక్‌ ప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - May 06 , 2026 | 12:14 AM