Share News

పెరుగుతున్న గుండె జబ్బులు

ABN , Publish Date - Sep 29 , 2026 | 11:37 PM

మారిన ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడంతో గుండె జబ్బులు పెరుగుతున్నాయని కేఎంసీ (కర్నూలు మెడికల్‌ కాలేజీ) ప్రిన్సిపాల్‌ డా.కే.చిట్టినరసమ్మ అన్నారు.

పెరుగుతున్న గుండె జబ్బులు
మాట్లాడుతున్న ప్రిన్సిపాల్‌ డా.కే.చిట్టినరసమ్మ

కేఎంసీ ప్రిన్సిపాల్‌ కె.చిట్టినరసమ్మ

జీజీహెచ్‌లో వరల్డ్‌ హార్ట్‌ డే

కర్నూలు హాస్పిటల్‌, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): మారిన ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడంతో గుండె జబ్బులు పెరుగుతున్నాయని కేఎంసీ (కర్నూలు మెడికల్‌ కాలేజీ) ప్రిన్సిపాల్‌ డా.కే.చిట్టినరసమ్మ అన్నారు. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల కార్డియాలజి విభాగంలోని క్యాత్‌ల్యాబ్‌లో వరల్డ్‌ హార్ట్‌ డేను నిర్వహించారు. ఈ కార్యక్రమా నికి కేఎంసీ ప్రిన్సిపాల్‌ డా.కే.చిట్టినరసమ్మ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు గుండె నిరంతరం పని చేస్తుందని, గుండెను ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంచుకోవాలన్నారు. 20ఏళ్ల క్రితం ప్రతి ఒక్కరూ సైకిల్‌ తొక్కేవారని, ఏ పనికి వెళ్లాలన్నా నడిచిపోయేవారనీ, ప్రస్తుతం ఈ పరిస్థితి లేదని శారీరక శ్రమ లేకపోవడంతో గుండె పనితీరు, సామర్థ్యం తగ్గుతుందన్నారు. వైస్‌ ప్రిన్సిపాల్‌ డా.డి.శ్రీరాములు మాట్లాడుతూ యువతలో గుండెజబ్బులు పెరుగుతున్నాయని, 40ఏళ్ల లోపు బాధితులే ఎక్కువగా ఉన్నారన్నారు. కార్డియాలజి విభాగపు అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డా.పి.ప్రశాంత్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు డా.బి.కిరణ్‌ కుమార్‌ రెడ్డి, డా.రవికిరణ్‌, డా.రాజ్‌కుమార్‌, డా.ఉదయ్‌ బిందు, పీజీ వైద్య విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - Sep 29 , 2026 | 11:37 PM