Share News

ఓటమి భయంతోనే అల్లర్లు

ABN , Publish Date - Oct 19 , 2026 | 12:29 AM

స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి భయంతోనే వైసీపీ నాయకులు అల్లర్లు సృష్టిస్తున్నారని ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి విమర్శించారు.

ఓటమి భయంతోనే అల్లర్లు
టీడీపీ నాయకులతో చర్చిస్తున్న మంత్రి బీసీ

ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి

బనగానపలె, అక్టోబరు18(ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి భయంతోనే వైసీపీ నాయకులు అల్లర్లు సృష్టిస్తున్నారని ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి విమర్శించారు. ఆదివారం బనగానపల్లె మండలంలోని కాపులపల్లె మంత్రి బీసీ ఫాం హౌస్‌లో బనగానపల్లె మండల ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్‌ ఎన్నికలపై సమావేశం నిర్వహించారు. ఆయా గ్రామాల టీడీపీ నాయకులు, కార్యకర్తలతో ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్‌ ఎంపికలో ఏకాభిప్రాయానికి వచ్చేలా చర్చలు జరిగాయి. గ్రామాల వారికి టీడీపీ కార్యకర్తల, నాయకుల అభిప్రాయం మంత్రి స్వీకరించారు. అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల సన్నద్ధత పార్టీ అనుసరించాల్సిన కార్యాచరణపై విస్తృతంగా చర్చించారు. స్థానిక పరిస్థితు లు, నాయయకులు, కార్యకర్తల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని అభ్యర్థుల ఎంపిక కార్యక్రమం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఎన్నికల సమయంలో పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉంటూ ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించాలన్నారు. మాజీ ఎంపీపీ అంబాల రామకృష్ణారెడ్డి, ఎస్సార్బీసీ ప్రాజెక్టు చైర్మన్‌ కాట్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి, యాగంటి ఆలయ చైర్మన్‌ మౌళీశ్వరరెడ్డి, కుమారస్వామిరెడ్డి, బత్తుల శివశంకర్‌రెడ్డి, బాలరెడ్డి, బత్తుల భాస్కర్‌రెడ్డి, బత్తుల గోపాల్‌రెడ్డి, బత్తుల నారాయణరెడ్డి భూషన్న, వల్లెపుశంకర్‌, షేక్షావలి, బాలరాజు, కైప రఘునాథరెడ్డి, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 19 , 2026 | 12:29 AM