Share News

వరి గడ్డి ధరల మోత..

ABN , Publish Date - Mar 18 , 2026 | 12:11 AM

వరిగడ్డి ధరలు ఆకాశాన్నంటాయి, ట్రాక్టర్‌ వరిగడ్డి ధర రూ.15 వేలకు చేరుకోవడంతో పాడి రైతులు గగ్గోలు పెడుతున్నారు.

వరి గడ్డి ధరల మోత..
ట్రాక్టర్‌లో అమ్మకానికి ఉంచిన వరిగడ్డి

ఫ ట్రాక్టర్‌ ధర రూ.15 వేలు

ఫ గగ్గోలు పెడుతున్న పాడి రైతులు

ప్యాపిలి, మార్చి 17 (ఆంధ్రజ్యోతి): వరిగడ్డి ధరలు ఆకాశాన్నంటాయి, ట్రాక్టర్‌ వరిగడ్డి ధర రూ.15 వేలకు చేరుకోవడంతో పాడి రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఖరీ్‌ఫలో ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంటలు దెబ్బతినడంతో పశుగ్రాసం కొరత తీవ్రంగా ఏంది. దీంతో వ్యాపారులు బనగానపల్లి, అవుకు, అనంతపురం జిల్లా పామిడి, కల్లూరు ప్రాంతాల నుంచి ట్రాక్టర్ల ద్వారా వరిగడ్డి తెచ్చి ఇష్టానుసారంగా ధరలు పెంచుతున్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గత ఏడాది రూ.11 వేలు

గత ఏడాది ట్రాక్టర్‌ ధర రూ.11 వేలు ఉండగా ఈ ఏడాది ఏకంగా రూ. 15వేలకు పెంచారు. పాడి రైతులు పశుపోషణ కోసం గత్యంతర లేక వ్యాపారులు నిర్ణయించిన ధరలకే కొనుక్కుని నష్టపోతున్నారు. వ్యవసాధికారులు ఽధరలు నియంత్రించాలని, పశుగ్రాసం అందేలా చూడాలని పాడి రైతులు కోరుతున్నారు.

Updated Date - Mar 18 , 2026 | 12:11 AM