Share News

అనస్థీషియాలో విప్లవాత్మక మార్పులు

ABN , Publish Date - Apr 26 , 2026 | 11:42 PM

మత్తుమందు ఆవిర్భావం నుంచి అనస్థీషియా విభాగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు వచ్చాయని కర్నూలు జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డా.కే.వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.

అనస్థీషియాలో విప్లవాత్మక మార్పులు
మాట్లాడుతున్న సూపరింటెండెంట్‌ డాక్టర్‌ వెంకటేశ్వర్లు

జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ కె.వెంకటేశ్వర్లు

కర్నూలు హాస్పిటల్‌, ఏప్రిల్‌ 25 (ఆంధ్రజ్యోతి): మత్తుమందు ఆవిర్భావం నుంచి అనస్థీషియా విభాగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు వచ్చాయని కర్నూలు జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డా.కే.వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. కర్నూలు మెడికల్‌ కాలేజీ ఆవరణంలో ఆదివారం న్యూమార్టన్‌ హాల్‌లో అనస్థీషియా జోనల్‌ వైద్య విజ్ఞాన సదస్సు హెచ్‌వోడీ డా.సుధీర్‌కుమార్‌ ఆధ్వర్యంలో జరిగింది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న హాస్పిటల్‌ సూపరింటెండెంట్‌ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వైద్య రంగంలో అనస్థీషియా అత్యంత కీలకమన్నారు. ఆస్పత్రిలో అనస్థీషియా విభాగం ఎంతో అభివృద్ధి చెందిందని, పెయిన్‌ లేని క్లీనిక్‌ను కూడా ప్రారంభించారన్నారు. కార్యక్రమంలో అనస్థీషియా విభాగం సీనియర్‌ ప్రొఫెసర్లు డా.రామశివనాయక్‌, డా.విశాల, ఏపీఎంసీ అబ్జర్వర్‌ డా.శివకుమార్‌, జోనల్‌ కోఆర్డినేటర్‌ డా.బాలేశ్వరి, కర్నూలు మెడికల్‌ కాలేజీ, నంద్యాల మెడికల్‌ కాలేజీ, అనంపురం, విశ్వభారతి, శాంతిరాం మెడికల్‌ కాలేజీలకు చెందిన పీజీ వైద్య విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - Apr 26 , 2026 | 11:42 PM