వైద్య రంగంలో విప్లవం సంజీవని
ABN , Publish Date - Jul 24 , 2026 | 12:28 AM
వైద్యరంగంలో సరికొత్త డిజిటల్ విప్లవం ఆరంభమైంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్య పరిరక్షణకు అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంజీవిని కార్యక్రమాన్ని ఈ నెల 25న ఆస్పరిలో సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు.
టెలి మెడిసిన్ ద్వారా రోగులకు స్పెషలిస్టు సేవలు
కర్నూలు హాస్పిటల్, జూలై 23 (ఆంధ్రజ్యోతి): వైద్యరంగంలో సరికొత్త డిజిటల్ విప్లవం ఆరంభమైంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్య పరిరక్షణకు అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంజీవిని కార్యక్రమాన్ని ఈ నెల 25న ఆస్పరిలో సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు. అందులో భాగంగా ఆస్పరి పీహెచ్‌సీ నుంచి కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు టెలి మెడిసిన్ ద్వారా వీడియో కాన్ఫరెన్స్‌ను డెమోగా వైద్యులు నిర్వహించారు. జూన్ 12వ తేదీన ఆస్పరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి 21 ఏళ్ల గర్భిణి ప్రసవం కోసం వచ్చింది. అత్యంత క్లిష్టమైన కాన్పును పీహెచ్‌సీ మెడికల్ ఆఫీసర్ డా.వీ. బాలకృష్ణారెడ్డి సిబ్బంది సహకారం విజయవంతంగా నిర్వహించారు. సంజీవిని కార్యక్రమంలో భాగంగా గురువారం సాయంత్రం ఆస్పరి పీహెచ్‌సీ నుంచి ప్రసవమైన వడ్డె సుజాత, అక్కడి మెడికల్ ఆఫీసర్ టెక్నికల్ టీమ్‌తో వర్చువల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల నుంచి స్పెషలిస్టు వైద్యులు తల్లి బిడ్డకు డెమో జూమ్ ద్వారా సూచనలు అందించారు. కర్నూలు మెడికల్ కాలేజీలోని టెలి మెడిసిన్ హబ్ నుంచి గైనకాలిజస్టులు డా. విశ్వనాథ్, డా. షబానా, డా. నంద కిషోర్, డా. లక్ష్మినారాయణ, ఫీజీషియన్ డా. దివ్య టెలి మెడిసిన్ నోడల్ ఆఫీసర్ డా.కిరణ్ కుమార్ పాల్గొని స్పెషలిస్టు సేవలు అందించారు.