Share News

రెవెన్యూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలి: కలెక్టర్‌

ABN , Publish Date - Oct 07 , 2026 | 11:26 PM

పీజీఆర్‌ఎ్‌సలో రెవెన్యూ శాఖకు సంబంధించిన దరఖాస్తులను పునరావృతం కాకుండా సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్‌ రాజకుమారి అధికారులను ఆదేశించారు.

రెవెన్యూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలి: కలెక్టర్‌
మాట్లాడుతున్న కలెక్టర్‌, పక్కన జేసీ, సబ్‌ కలెక్టర్‌

నంద్యాల నూనెపల్లి, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): పీజీఆర్‌ఎ్‌సలో రెవెన్యూ శాఖకు సంబంధించిన దరఖాస్తులను పునరావృతం కాకుండా సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్‌ రాజకుమారి అధికారులను ఆదేశించారు. బుధవారం మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో రెవెన్యూ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. ముఖ్యంగా 22ఏ, చుక్కల భూములు, ఇనాం పట్టాలు, మ్యూటేషన్‌, సర్వే సర్టిఫికెట్ల తదితర అంశాలలో దరఖాస్తుదారులకు సకాలంలో పరిష్కారం అందేలా చర్యలు చేపట్టాలన్నారు. జుపాడుబంగ్లా, పాములపాడు, మిడుతూరు తదితర మండలాలలో రెవెన్యూ దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో కుల ధ్రువీకరణ పత్రాలు నిబంధనల ప్రకారం సత్వరమే జారీ చేయాలని ఆదేశించారు. ‘నో డ్యూ’ సర్టిఫికెట్‌లకు సంబంధించి అవసరమైన పన్ను వివరాలు ఆన్‌లైన్‌లో ప్రతిబింబించేలా సమస్వయంతో చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో జేసీ సూరజ్‌ధనుంజయ్‌, సబ్‌ కలెక్టర్‌ మనీషా, డీఆర్వో రామునాయక్‌, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్‌ ప్రియాంక, ఆర్డీవో, తహసీల్దార్లు పాల్గొన్నారు.

Updated Date - Oct 07 , 2026 | 11:26 PM