Share News

రీ సర్వేను వేగవంతం చేయాలి: జేసీ

ABN , Publish Date - Nov 20 , 2026 | 12:31 AM

జిల్లాలో ఫ్రీ హోల్డ్‌ భూముల సమస్యల పరిష్కార ప్రక్రియ, రీ సర్వే ప్రక్రియను వేగవంతం చేయాలని జాయింట్‌ కలెక్టర్‌ సూరజ్‌ ధనుంజయ్‌ ఆదేశించారు.

రీ సర్వేను వేగవంతం చేయాలి: జేసీ
సమీక్షిస్తున్న జేసీ సూరజ్‌ ధనుంజయ్‌

నంద్యాల నూనెపల్లి, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఫ్రీ హోల్డ్‌ భూముల సమస్యల పరిష్కార ప్రక్రియ, రీ సర్వే ప్రక్రియను వేగవంతం చేయాలని జాయింట్‌ కలెక్టర్‌ సూరజ్‌ ధనుంజయ్‌ ఆదేశించారు. పట్టణంలోని కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌లో గురువారం ఫ్రీహోల్డ్‌ భూముల సమస్యల పరిష్కారం, రీ సర్వే తదితర అంశాలపై ఆర్డీవోలు, తహసీల్దార్లు, సర్వే అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఫ్రీ హోల్డ్‌ భూముల సమస్యల పరిష్కారం, రీసర్వేకు సంబంధించిన పెండింగ్‌ పనులు, 5, 6వ విడత రీసర్వేలో డీఎల్‌ఆర్‌ పనుల పురోగతిపై సమీక్షించారు. నిర్ణీత గడువులోగా పెండింగ్‌ పనులు పూర్తి చేయాలని మండలాల వారీగా పెండింగ్‌ పనులను గుర్తించి వాటిని త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని జేసీ సూచించారు. సమావేశంలో సబ్‌ కలెక్టర్‌ మనీశా తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 20 , 2026 | 12:31 AM