తాగునీటి సరఫరా పునరుద్ధరణ
ABN , Publish Date - Aug 18 , 2026 | 12:02 AM
నగరంలోని అశోక్‌నగర్ నీటిశుద్ధి కేంద్రం (పంప్‌హౌస్)లో నిర్వహణ మెరుగుదల, మర మ్మతులు, పూడిక, ఇతర అవక్షేపాల తొలగింపు పనులు విజయవం తంగా పూర్తయినట్లు నగర పాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు తెలిపారు.
మంగళవారం అర్ధరాత్రి నుంచి యథావిధిగా..
నగర పాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు
కర్నూలు న్యూసిటీ, ఆగస్టు 17(ఆంధ్రజ్యోతి): నగరంలోని అశోక్‌నగర్ నీటిశుద్ధి కేంద్రం (పంప్‌హౌస్)లో నిర్వహణ మెరుగుదల, మర మ్మతులు, పూడిక, ఇతర అవక్షేపాల తొలగింపు పనులు విజయవం తంగా పూర్తయినట్లు నగర పాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు తెలిపారు. సోమవారం పంప్‌హౌస్‌లో జరుగుతున్న మరమ్మతు పనులను కమిషనర్ పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ పంప్‌హౌస్ నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచడంతోపాటు శుద్ధి, మరమ్మత్తు పనులు చేపట్టడంతో సోమవారం నగరంలోని పలుకాలనీల్లో తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడిందన్నారు. ఎట్టకేలకు పనులు పూర్తికావడంతో మంగళవారం అర్ధ రాత్రి నుంచి తాగునీటి సరఫరాను యథావిధిగా పునరుద్ధరిస్తున్నట్లు తెలి పారు. అంత కుముందు ఎనఆర్‌పేట, బాలాజీ నగర్ తదితర ప్రాంతాల్లో పారిశుధ్య పనులను పరిశీలించారు. అనంతరం సెట్కూర్ వద్ద ఉన్న అన్నక్యాంటీ నను తనఖీ చేశారు. ఆయన వెంట ఎస్‌ఈ జే.రమణమూర్తి, డీఈఈ నరేష్, ఏఈలు జనార్ధన, ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, శానిటరీ ఇనస్పెక్టర్ రవి ఉన్నారు.
అర్జీలను గడువులోపు పరిష్కరించాలి: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చే అర్జీలను గడువులోపు పరిష్కరించాలని కమిషనర్ చల్లా ఓబులేసు అధికారులను ఆదేశించారు. స్థానిక ఎస్‌బీఐ కాలనీలోని నగర పాలక సమావేశ భవనంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆయన ప్రజల నుంచి 17 అర్జీలను స్వీకరించారు. 36వ వార్డు వాసవీ నగర్‌లో కాలువలు నిర్మిం చాలని టీడీపీ జిల్లా మాజీ ఉపాధ్యక్షుడు మల్లెల పుల్లారెడ్డి కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు. పుల్లారెడ్డి మాట్లాడుతూ వాసవి నగర్‌లో కాలు వలు లేకపోవడంతో నీరంతా రోడ్లపైకి చేరి చిన్నారులు అనారోగ్యాలకు గురవుతున్నారన్నారు. కర్నూలు-బళ్లారి రోడ్డుకు మరమ్మతులు చేపట్టి, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాలని బహుజన ముక్తిపార్టీ జిల్లా కన్వీనర్ దాసరి రామశేషయ్య కోరారు. అడిషనల్ కమిషనర్ ఆర్‌జీవీ కృష్ణకు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో ఏసీపీ నాగరాజు, ఎంఈ మనోహర్ రెడ్డి, మేనేజర్ జునైద్, కార్యదర్శి నాగరాజు, ఆర్‌వోలు క్రిష్టఫర్, వాజిద్, పట్టణ ప్రణాళిక అధికారి అంజాద్ బాషా పాల్గొన్నారు.