Share News

సమస్యలను తక్షణం పరిష్కరించండి

ABN , Publish Date - Jun 29 , 2026 | 11:27 PM

పీజీఆర్‌ఎస్‌లో వచ్చిన ఫిర్యాదులను విచారించి చట్టపరిధిలో తక్షణం పరిష్కారం చూపాలని, ఫిర్యా దులు మరోమారు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకో వాలని ఎస్పీ సునీల్‌ షొరాన్‌ ఆదేశించారు.

సమస్యలను తక్షణం పరిష్కరించండి
ఫిర్యాదులు స్వీకరిస్తున్న జిల్లా ఎస్పీ

ఎస్పీ సునీల్‌ షెరాన్‌

పీజీఆర్‌ఎస్‌కు 105 ఫిర్యాదులు

నంద్యాల క్రైం, జూన్‌ 29 (ఆంధ్రజ్యోతి): పీజీఆర్‌ఎస్‌లో వచ్చిన ఫిర్యాదులను విచారించి చట్టపరిధిలో తక్షణం పరిష్కారం చూపాలని, ఫిర్యా దులు మరోమారు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకో వాలని ఎస్పీ సునీల్‌ షొరాన్‌ ఆదేశించారు. స్థానిక జిల్లా పోలీసు కార్యాల యంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వివిధ సమస్యలపై 105 వినతులు ఎస్పీకి అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ స్వయంగా ఫిర్యాదిదారులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకుని భరోసా కల్పించారు. ఫిర్యాదులపై పూర్తిస్థాయిలో విచారణ నిర్వహించి పరి ష్కారం చూపుతామని వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పరిష్కరించిన ఫిర్యాదుల వివరాలను అధికారులు జిల్లా ప్రధాన కార్యాలయానికి అందజేయాలని సూచించారు.

Updated Date - Jun 29 , 2026 | 11:27 PM