Share News

అర్జీలను గడువులోగా పరిష్కరించండి

ABN , Publish Date - Aug 25 , 2026 | 12:19 AM

ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి ప్రజల నుంచి వచ్చిన అర్జీలను గడువులో గా పరిష్కరించాలని నగర పాలక సంస్థ కమిషనర్‌ చల్లా ఓబులేసు అధికారులను ఆదేశించారు.

అర్జీలను గడువులోగా పరిష్కరించండి
ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తున్న కమిషనర్‌ చల్లా ఓబులేసు

నగర పాలక సంస్థ కమిషనర్‌ చల్లా ఓబులేసు

కర్నూలు న్యూసిటీ, ఆగస్టు 24(ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి ప్రజల నుంచి వచ్చిన అర్జీలను గడువులో గా పరిష్కరించాలని నగర పాలక సంస్థ కమిషనర్‌ చల్లా ఓబులేసు అధికారులను ఆదేశించారు. స్థానిక ఎస్‌బీఐ కాలనీలోని నగర పాలక సమావేశ భవనంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరి ష్కార వేదిక కార్యక్రమానికి ప్రజల నుంచి 17 అర్జీలు స్వీకరించారు. కమిషనర్‌ మాట్లాడుతూ అర్జీలను గడువులోగా పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్‌ కమిషనర్‌ ఆర్‌జీవీ కృష్ణ, డిప్యూటీ కమిషనర్‌ సతీష్‌కుమార్‌రెడ్డి, ఎస్‌ఈ జే.రమణమూర్తి, ప్రజారోగ్య అధికారి డా.ఎం. రఘు, ఏసీపీలు షబ్నమ్‌ శాసి్త్ర, నాగ రాజు, ఎంఈ మనోహర్‌రెడ్డి, మేనేజర్‌ జునైద్‌, కార్యదర్శి నాగరాజు, ఆర్‌వోలు క్రిష్టఫర్‌, వాజిద్‌ పాల్గొన్నారు.

Updated Date - Aug 25 , 2026 | 12:19 AM