ప్రజల సమస్యలు పరిష్కరించండి
ABN , Publish Date - Jul 06 , 2026 | 11:23 PM
ప్రజల సమస్యలను అర్జీదారులు పూర్తి సంతృప్తి చెందేలా నాణ్యతతో పరిష్కరించాలని కలెక్టర్ డా.ఏ. సిరి అధికారులను ఆదేశించారు.
కలెక్టర్ సిరి
కర్నూలు కలెక్టరేట్, జూలై 6 (ఆంధ్రజ్యోతి): ప్రజల సమస్యలను అర్జీదారులు పూర్తి సంతృప్తి చెందేలా నాణ్యతతో పరిష్కరించాలని కలెక్టర్ డా.ఏ. సిరి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో నిర్వహించిన పీజీఆర్‌ఎస్ కార్యక్రమంతో పాటు ఎస్సీ, ఎస్టీ గ్రీవెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డా. సిరి మాట్లాడుతూ పీజీఆర్‌ఎస్‌లో నమోదవుతున్న రీ ఓపెన్, ఇంప్రాపర్ రెడ్రెసల్ కేసుల సంఖ్యను పూర్తిగా తగ్గించే దిశగా ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారమే పరమావధిగా జిల్లా యంత్రాంగం పని చేయాలని సూచించారు. అధికారులందరూ క్రమం తప్పకుండా ప్రజా సమస్యల పరిష్కార వేదికకు హాజరవ్వాలని, గైర్హాజర్‌ను ఉపేక్షించకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు.