Share News

అర్జీలను త్వరగా పరిష్కరించండి

ABN , Publish Date - Mar 09 , 2026 | 11:45 PM

ప్రజా ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలని జేసీ నూరుల్‌ ఖమర్‌ అధికారులను ఆదేశించారు.

అర్జీలను త్వరగా పరిష్కరించండి
ప్రజల నుంచి అర్జీలను స్వీకరిస్తున్న జేసీ నూరుల్‌ ఖమర్‌

జేసీ నూరుల్‌ ఖమర్‌

కర్నూలు కలెక్టరేట్‌, మార్చి 9(ఆంధ్రజ్యోతి): ప్రజా ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలని జేసీ నూరుల్‌ ఖమర్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌ సునయన ఆడిటోరియంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా ఆయన ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. జేసీ మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదులపై అధికారుల ప్రత్యేక దృష్టిసారించి ప్రతి దరఖాస్తును సమయానుకూలంగా పరిశీలించి పెండింగ్‌ లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. దరఖాస్తులను ఎప్పటికప్పుడు ఓపెన్‌ చేసి పరిశీలించాల్సి ఉన్నప్పటికీ, ప్రస్తుతం ఇంకా కొన్ని అర్జీలు ఇంకా ఓపెన్‌ చేయలేదన్నారు. ఈ-ఓపెన్‌ అయిన అర్జీలపై ప్రత్యేక పర్యవేక్షణ ఉండాలని, అవి మళ్లీ పెండింగ్‌లో పడకుండా చర్యలు తీసుకోవాలన్నారు. డీఆర్వో సి. వెంకటనారాయణమ్మ, హౌసింగ్‌ పీడీ చిరంజీవి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Mar 09 , 2026 | 11:45 PM