Share News

అర్జీలను నాణ్యతతో పరిష్కరించండి

ABN , Publish Date - Sep 21 , 2026 | 11:24 PM

ప్రజల సమస్యల పరిష్కారంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా అర్జీదారులు సంతృప్తి చెందేలా నాణ్యతతో కూడిన పరిష్కారాలను అందించాలని జాయింట్‌ కలెక్టర్‌ నూరుల్‌ ఖమర్‌ అధికారులను ఆదేశించారు.

అర్జీలను నాణ్యతతో పరిష్కరించండి
ప్రజల నుంచి అర్జీలను స్వీకరిస్తున్న జేసీ నూరుల్‌ ఖమర్‌

కర్నూలు కలెక్టరేట్‌, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): ప్రజల సమస్యల పరిష్కారంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా అర్జీదారులు సంతృప్తి చెందేలా నాణ్యతతో కూడిన పరిష్కారాలను అందించాలని జాయింట్‌ కలెక్టర్‌ నూరుల్‌ ఖమర్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ పీజీఆర్‌ఎ్‌సలో నమోదవుతున్న రీఓపెన్‌, ఇంప్రాపర్‌ రెడ్రెసల్‌ కేసుల శాతాన్ని పూర్తిగా తగ్గించే దిశగా ప్రత్యేక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

Updated Date - Sep 21 , 2026 | 11:24 PM