అర్జీలను పరిష్కరించండి
ABN , Publish Date - Jun 08 , 2026 | 11:46 PM
అర్జీలను నిర్దేశించిన గడువులోపు నాణ్యతతతో పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి అధికారులను ఆదేశించారు.
కలెక్టర్ సిరి
కర్నూలు కలెక్టరేట్, జూన్ 8 (ఆంధ్రజ్యోతి): అర్జీలను నిర్దేశించిన గడువులోపు నాణ్యతతతో పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సిరి మాట్లాడుతూ పీజీఆర్‌ఎ్‌సలో వచ్చిన అర్జీలను పరిష్కరించడంలో అధికారులు, నిర్లక్ష్యం చేయకూడదన్నారు. ఏ ఒక్క అర్జీ కూడా బీయాండ్‌ఎ్‌సఎల్‌ఎలోకి వెళ్లకూడదన్నారు. ఎట్టి పరిస్థితుల్లో అర్జీలు రీఓపెన్ కాకూడదన్నారు. అదే విధంగా ‘ఎట్ టూ వ్యూ’ లేకుండా ఎప్పటికప్పుడు అర్జీలను చూడాలన్నారు. అధికారులు అర్జీదారులతో మర్యాదగా, సానుభూతితో వ్యవహరించాలన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్, అధికారులు పాల్గొన్నారు.