Share News

పెండింగ్‌ కేసులను సత్వరమే పరిష్కరించండి

ABN , Publish Date - Feb 12 , 2026 | 11:51 PM

జిల్లాలో పెండింగ్‌లో ఉన్న కేసులకు ప్రాధాన్యం ఇచ్చి వాటిని సత్వరమే పరిష్కరించాలని జిల్లా ప్రధాన న్యాయాధి కారి జి.కబర్ధి అన్నారు.

పెండింగ్‌ కేసులను సత్వరమే పరిష్కరించండి
మాట్లాడుతున్న జి.కబర్ది

జిల్లా ప్రధాన న్యాయాధికారి జి.కబర్ధి

కర్నూలు లీగల్‌, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో పెండింగ్‌లో ఉన్న కేసులకు ప్రాధాన్యం ఇచ్చి వాటిని సత్వరమే పరిష్కరించాలని జిల్లా ప్రధాన న్యాయాధి కారి జి.కబర్ధి అన్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లా న్యాయాధికారులతో గురువారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. ఈ నెల 14న అన్ని కోర్టుల్లో జాతీయ లోక్‌ అదాలత్‌ను నిర్వహిస్తున్నారన్నారు. ఆ జాతీయ లోక్‌ అదాలత్‌లో వీలైనన్ని కేసులు పరిష్కారమయ్యేందుకు కృషి చేయాలని సూచించారు. పది సంవ త్సరాలకు పైగా పెండింగ్‌లో ఉన్న సివిల్‌ కేసులపై ప్రత్యేక దృష్టిసారించి జాతీయ లోక్‌ అదాల త్‌లో వీలైనన్ని ఎక్కువ కేసులు పరిష్కారమ య్యేందుకు వీలుగా పోలీసు అధికారులు, న్యాయవాదులు, పారా లీగల్‌ వలంటీర్ల సహకారం తీసుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకటశేషాద్రితో పాటు ఉమ్మడి కర్నూలు జిల్లాలోని న్యాయాధికారుల పాల్గొన్నారు.

Updated Date - Feb 12 , 2026 | 11:51 PM