అభ్యంతరాలను త్వరగా పరిష్కరించండి
ABN , Publish Date - Aug 20 , 2026 | 11:35 PM
ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు నోటీసుల పంపిణీ, విచారణ క్లెయిమ్‌లు, అభ్యంతరాల పరిష్కార ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్‌యాదవ్ తెలిపారు.
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్
నంద్యాల నూనెపల్లి, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి) : ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు నోటీసుల పంపిణీ, విచారణ క్లెయిమ్‌లు, అభ్యంతరాల పరిష్కార ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్‌యాదవ్ తెలిపారు. గురువారం సర్ ప్రక్రియలో భాగంగా నోటీసుల పంపిణీ విచారణ, ఓటర్ల జాబితాకు సంబంధించి అభ్యంతరాలు, క్లెయిమ్‌ల పరిష్కార ప్రక్రియ తదితర అంశాలపై ఆయన అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మాట్లాడుతూ.. ఫారం 6,7,8 ద్వారా వచ్చిన క్లెయిమ్స్ అభ్యంతరాలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలన్నారు. దీని కోసం నోటీసుల పంపిణీ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. ఎక్కువ పెండింగ్ ఉన్న నియోజకవర్గాలు పోలింగ్ కేంద్రాలపై దృష్టి సారించాలన్నారు. నోటీసుల జనరేటర్ పంపిణీ ప్రక్రియను వెంటనే పూర్తి చేసి మ్యాపింగ్ కానీ ఓటర్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. జూలై 1వ తేదీ నాటికి 18 ఏళ్లు పూర్తయిన యువతను ఓటర్లుగా నమోదు చేసేందుకు కళాశాలలో శిబిరాలు నిర్వహించాలన్నారు. ఆగస్టు 22, 23, 29, 30 తేదీల్లో ప్రత్యేక ప్రచార దినాలు నిర్వహించాలన్నారు. కాన్ఫరెన్స్‌లో డీఆర్వో రామునాయక్ తదితరులు పాల్గొన్నారు.