Share News

గడువులోగా పరిష్కరించండి

ABN , Publish Date - Oct 12 , 2026 | 11:50 PM

ప్రతి దరఖాస్తును ఎలాంటి జాప్యం లేకుండా నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్‌ రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్‌ఎస్‌ హాల్లో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఆమె మాట్లాడుతూ.. ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు.

గడువులోగా పరిష్కరించండి
అర్జీలు స్వీకరిస్తున్న కలెక్టర్‌ రాజకుమారి

కలెక్టర్‌ రాజకుమారి

నంద్యాల నూనెపల్లి, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి): ప్రతి దరఖాస్తును ఎలాంటి జాప్యం లేకుండా నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్‌ రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్‌ఎస్‌ హాల్లో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఆమె మాట్లాడుతూ.. ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. పునఃప్రారంభించిన (రీ ఓపెన్‌) అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అర్జీదారులతతో నేరుగా మాట్లాడి సమస్యల మూలాలను గుర్తించి, నాణ్యమైన పరిష్కారం అందిం చాలన్నారు. మొత్తం పీజీఆర్‌ఎస్‌ ద్వారా 276 దరఖాస్తులు, రెవెన్యూ క్లినిక్‌ ద్వారా 148 అర్జీలు స్వీకరించినట్లు తెలిపారు.

మహిళల ప్రతిభను గుర్తించాలి

మహిళల ప్రతిభనను గుర్తించి వారికి అన్ని రంగాల్లో వారికి సమాన అవకాశాలు కల్పించి సమానత్వంతో కూడిన సమాజ నిర్మాణానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్‌ రాజ కుమారి పిలుపునిచ్చారు. అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల విద్యార్థులకు నిర్వహించిన లఘుచిత్ర పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన నంద్యాల, ఆళ్లగడ్డ, ఎర్రగుంట్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలకు వరుసగా రూ.30 వేలు, రూ.20వేలు, రూ.10వేలు చెక్కులను అందజేశారు.

Updated Date - Oct 12 , 2026 | 11:50 PM