సమస్యలను సత్వరమే పరిష్కరించండి
ABN , Publish Date - Sep 21 , 2026 | 11:16 PM
ప్రజా సమస్యలను సత్వరమే పరిష్క రించాలని ఆర్‌అండ్‌బీ శాఖా మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి అఽధికారులను కోరారు.
ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి
బనగానపల్లె, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యలను సత్వరమే పరిష్క రించాలని ఆర్‌అండ్‌బీ శాఖా మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి అఽధికారులను కోరారు. సోమవా రం బనగానపల్లె మంత్రి క్యాంపు కార్యాలయంలో ప్రజాసమస్యల పరిష్కారవేదిక కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని వివిధ గ్రామాల నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అధికసంఖ్యలో తరలివచ్చి తమ సమస్యలను పరిష్కరించాలని మంత్రికి దరఖాస్తులను స్వీకరించారు. కొన్ని సమస్యలను అప్పటికప్పుడే అధికారులకు ఫోన్లు చేసి పరిష్కరించారు. కొన్ని సమస్యలను సంబంధిత అధికారులకు సిఫార్సు చేసి వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ప్రతి దరఖాస్తును పరిశీలించి నిబంధనల మేరకు పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ యంత్రాంగం ప్రజల సమస్యలపై బాధ్యతాయుతంగా స్పందించాలని అధికారులకు మంత్రి సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో మంత్రి చూపుతున్న చొరవకు జిల్లా ప్రజలు, అర్జీలు సమర్పించిన టీడీపీ నాయకలు, కార్యకర్తలు, ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.