Share News

ఉద్యోగుల కేసులను త్వరగా పరిష్కరించండి

ABN , Publish Date - Oct 06 , 2026 | 11:25 PM

ఉద్యోగులపై పెండింగ్‌లో ఉన్న క్రమశిక్షణా కేసులను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్‌ రాజకుమారి అధికారులను ఆదేశించారు.

ఉద్యోగుల కేసులను త్వరగా పరిష్కరించండి
మాట్లాడుతున్న కలెక్టర్‌, పక్కన డీఆర్వో

కలెక్టర్‌ రాజకుమారి

నంద్యాల నూనెపల్లి, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): ఉద్యోగులపై పెండింగ్‌లో ఉన్న క్రమశిక్షణా కేసులను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్‌ రాజకుమారి అధికారులను ఆదేశించారు. పట్టణంలోని కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌లో మంగళవారం ఉద్యోగుల క్రమశిక్షణా కేసులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ శాఖల పరిధిలో పెండింగ్‌లో ఉన్న కేసుల స్థితిగతులు, ఇప్పటివరకు చేపట్టిన చర్యలు, తదుపరి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్‌ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబరు 91, 77, 177 ఆదేశాల మేరకు ఉద్యోగుల క్రమశిక్షణా కేసులపై ప్రతి నెల మొదటి వారంలో సమీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు. క్రమశిక్షణా కేసుల్లో పెండెన్సీకి ప్రధానంగా ఐదు దశలు కారణమవుతున్నాయన్నారు. ఇప్పటికే అభియోగాలు నమోదు చేసి, విచారణాధికారి నివేదిక సమర్పించిన కేసుల్లో తగిన తుది నిర్ణయం తీసుకొని కేసులకు లాజికల్‌ కన్‌క్లూజన్‌ ఇవ్వాలన్నారు. జిల్లాలో విద్యారంగాన్ని మరింత బలోపేతం చేసి విద్యార్థులకు మెరుగైన విద్యా సౌకర్యాలు, నాణ్యమైన బోధన అందించేలా సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్‌ రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం పాఠశాల విద్యాశాఖ పనితీరు, విద్యా కార్యక్రమాల అమలు, విద్యార్థులు, ఉపాఽధ్యాయుల హాజరు, పదో తరగతి ఫలితాల మెరుగుదల, ప్రత్యేక అవసరాలు గల పిల్లలు ఎన్‌రోల్‌మెంట్‌, స్కిల్‌ డెవల్‌పమెంట్‌ తదితర అంశాలపై పాఠశాల విద్యా శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ శ్యామలరావు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించిగా జిల్లా నుంచి కలెక్టర్‌, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు. అనంతరం జిల్లాలోని సంబంధిత శాఖాధికారులతో కలెక్టర్‌ మాట్లాడారు.

Updated Date - Oct 06 , 2026 | 11:26 PM