Share News

ఘనంగా గణతంత్ర వేడుకలు

ABN , Publish Date - Jan 27 , 2026 | 12:28 AM

పట్టణంలో 77వ గణతంత్ర వేడుకలను సోమవారం ఘనంగా జరుపుకున్నారు.

ఘనంగా గణతంత్ర వేడుకలు
డోనలో జెండా ఆవిష్కరణలో పాల్గొన్న ఎమ్మెల్యే కోట్ల, టీడీపీ నాయకులు

డోన టౌన, జనవరి 26(ఆంధ్రజ్యోతి): పట్టణంలో 77వ గణతంత్ర వేడుకలను సోమవారం ఘనంగా జరుపుకున్నారు. స్థానిక మున్సిపల్‌ కార్యాలయంలో కమిషనర్‌ ప్రసాద్‌గౌడు, ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్‌ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఎమ్మెల్యే కోట్ల మాట్లాడుతూ భారత రాజ్యాంగం దేశానికి మార్గదర్శకమన్నారు. అనంతరం ఉత్తమ సేవలు అందించిన మున్సిపల్‌ ఉద్యోగులకు ప్రశంసాపత్రాలను అంద జేశారు. అలాగే పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే కోట్ల జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, బోయ వాల్మీకి ఫెడరేషన రాష్ట్ర డైరెక్టర్‌ వలసల రామకృష్ణ, మున్సిపల్‌ వైస్‌ చైర్మన కోట్రికే హరికిషణ్‌, జిల్లా ఉపాధ్యక్షులు వెంకటనాయునిపల్లె శ్రీనివాసులు యాదవ్‌, టీడీపీ పట్టణ అధ్యక్షులు టీఈ రాఘవేంద్రగౌడు, భూమా నాగన్న, మాజీ ఎంపీపీ శేషఫణిగౌడు పాల్గొన్నారు. అలాగే పట్ట ణంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, కార్యా లయాల్లో గణతంత్ర వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. స్థానిక ఎంఎస్‌ఆర్‌ కార్యాలయంలో రాష్ట్ర సీడ్స్‌ డెవలప్మెంట్‌ కార్పొరేషన చైర్మన ధర్మవరం సుబ్బారెడ్డి, కూటమి నాయకులు, కార్యకర్త లతో కలిసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో యువ నాయకులు ధర్మవరం మన్నె గౌతమ్‌ కుమార్‌ రెడ్డి, టీడీపీ నాయకులు చాటకొండ శ్రీనివాసులు, రామసుబ్బయ్య, సిటీ కేబుల్‌ కిరణ్‌, మెట్ట మద్దయ్య, కోనేటి కాశీ విశ్వనాథ్‌, నీలం ప్రభాకర్‌ పాల్గొన్నారు. పట్టణంలోని కోర్టు ఆవరణలో సీనియర్‌ సివిల్‌ న్యాయాధికారి దివాకర్‌, ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ న్యాయాధికారి వినోద్‌ కుమార్‌లు జాతీయ జెండాను ఎగురవేశారు. న్యాయవాదులు పాల్గొన్నారు. పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ శ్రీనివాస్‌ జెండాను ఎగురవేశారు. సీఐలు ఇంతియాజ్‌ బాషా, సీఎం రాకేష్‌, ఎస్‌ఐలు శరత కుమార్‌ రెడ్డి, మమత, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

బనగానపల్లె: స్వాతంత్య్ర సమర యోధుల త్యాగాలను స్మరిం చుకో వాలని బనగానపల్లె పట్టణ మాజీ సరంచ బీసీ రాజారెడ్డి అన్నారు. పట్టణంలోని కొండపేట ప్రాథమిక పాఠశాలలో హెచఎం సతీశ ఆధ్వ ర్యంలో బీసీ రాజారెడ్డి పాఠశాల ఆవరణంలో జాతీయ జెండాను ఎగుర వేశారు. కార్యక్రమంలో టంగుటూరు శ్రీనయ్య ఉపాధ్యా యు లు పాల్గొన్నారు. ఆటల పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బీసీ రాజరెడ్డి నగదు ప్రోత్సాహక బహుమతులు అందించారు. బనగానపల్లె మెజిసే్ట్ర ట్‌ కోర్డులో జూనియర్‌ సివిల్‌ జడ్జి ప్రతిమ, బనగానపల్లె ఆర్డీవో కార్యా లయం ఆవరణలో తహసీల్దారు నారాయణ రెడ్డి, ఎంపీడీవో కార్యాల యంలో ఎంపీడీవో నాగరాజు, ఎంపీపీ మానసవీణ, మిట్టపల్లెలో సర్పంచ తులసిరెడ్డి, పాతపాడులో సర్పంచ మహేశ్వరరెడ్డి, కైప ఉన్నత పాఠశాలలో హెచఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, జెండాను ఆవిష్కరించారు. బనగానపల్లె గ్రామ పంచాయతీ కార్యాల యంలో ఉపసర్పంచ బురా నుద్దీన, డిప్యూటీ ఎంపీడీవో బాలాంజ నేయు లు, పలుకూరు గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఈవో సతీశరెడ్డి, బనగానపల్లె బాలుర ఉన్నతపాఠశాలలో హెచఎం భాస్కర్‌రెడ్డి, బనగానపల్లె టౌన పోలీస్‌ స్టేషనలో సీఐ ప్రవీణ్‌కుమార్‌, ఎస్‌ఐ దుగ్గిరెడ్డి,, కల్పన, రూరల్‌ సర్కిల్‌ కార్యాలయంలో సీఐ మంజునాథరెడ్డి, ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో అధ్యాపకులు కిశోర్‌, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్‌ లలిత, బనగానపల్లె ప్రభుత్వవైద్యశాలలో సూపరిండెంట్‌ డాక్టర్‌ ఉమాదేవి, పశువైద్యశాలలో ఏడీ మారుతిసకారాం, ఆర్టీసీ డిపో లో డీఎం శశిభూషన, మండల వ్యవసాయాధికారి కార్యాలయంలో ఏవో సుబ్బారెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు.

అవుకు: స్థానిక రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్‌ మల్లికార్జున రెడ్డి, మండల పరిషత కార్యాలయంలో ఎంపీడీవో రామకృష్ణవేణి, పంచా యతీ కార్యాలయంలో సర్పంచ మందా గుర్రమ్మ, పోలీస్‌ స్టేషనలో ఎస్‌ఐ అశోక్‌, సామాజిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్‌ అభినయ్‌, ఉప్పల పాడు ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్లు యశ్వంత, యమున, మదర్‌మోడల్‌ స్కూల్‌లో కరస్పాండెంట్‌ శ్రీనివాసులు, ప్రభుత్వ పాఠ శాలల్లో ప్రధానోపాధ్యాయులు జెండాను ఎగురవేశారు. మదర్‌ మోడల్‌ స్కూల్‌లో విద్యార్థుల విన్యాసాలు అబ్బుర పరిచాయి.

కోవెలకుంట్ల: పట్టణంలోని మేజర్‌ గ్రామపంచాయితీ ఆఽద్వర్యంలో డిప్యూటీ ఎంపిడిఓ ప్రకాష్‌ నాయుడు, పోలీస్‌ సర్కిల్‌ కార్యాలయంలో సీఐ హనుమంత నాయక్‌, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో వర ప్రసాదరావు, తహసీల్దార్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ పవన కుమార్‌ రెడ్డి, ప్రభుత్వ డిగ్రీ జూనియర్‌ కళాశాలలో ప్రిన్సిపాల్‌ వేణుగోపాల్‌, ప్రభుత్వ ఆస్పత్రిలో సూపరింటెండెంట్‌ చంద్రశేఖర్‌ రెడ్డి, ఎక్సైజ్‌ సీఐ కార్యాలయంలో ఇనచార్జి సీఐ సందీప్‌ యాదవ్‌, మార్కెట్‌ యార్డ్‌ కార్యాలయంలో సెక్రటరీ బండి నారాయణ స్వామిలు జాతీయ జెండాను ఎగురువేశారు.

బేతంచెర్ల: స్థానిక తహసీల్దార్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ నాగమణి, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపి నాగభూషణం రెడ్డి, పోలీస్‌ స్టేషనలో సీఐ వెంకటేశ్వరరావు, శేషారెడ్డి సామాజిక ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో డాక్టర్‌ సాగరిక, సబ్‌ రిజిస్టర్‌ కార్యాలయంలో సబ్‌ రిజిస్టర్‌ వనితలక్ష్మి, నగర పంచాయితీ కార్యాలయంలో చైర్మన చలం రెడ్డి, ఆదర్శ, కేజీబీవీ పాఠశాలలో ప్రిన్సిపాళ్లు మరియదాసు, అబిదాబి, జ్యోతిరావు మహాత్మా గాంధీ పూలే బీసీ బాలుర గురుకుల పాఠశాలలో ప్రిన్సిపాల్‌ రామ్మోహన, ప్రభుత్వ ఐటిఐ వైస్‌ ప్రిన్సిపాల్‌ విద్యాసాగర్‌, ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో కళాశాల వైస్‌ ప్రిన్సిపాల్‌ శ్రీధర్‌, మండల ఎంఆర్‌పీ భవనంలో మండల విద్యాధికారి సోమశేఖర్‌, విద్యుత సబ్‌స్టేషనలో ఏడీ మధుసూదన రెడ్డి జాతీయ జెండాను ఎగురువేశారు.

ఆళ్లగడ్డ: స్థానిక కోర్టు ఆవరణలో సీనియర్‌ సివిల్‌ న్యాయాధికారి శైలజ, మున్సిపల్‌ కార్యాలయంలో కమిషనర్‌ కిషోర్‌ కుమార్‌ జాతీయ జెండాను అవిష్కరించారు. అలాగే తహసీల్దార్‌ కార్యాలయంలో తహసీ ల్దార్‌ జ్యోతి రత్నకుమారి, టౌన స్టేషనలో సీఐ యుగంధర్‌, రూరల్‌ స్టేషనలో సీఐ రమణ, ఎస్‌ఎస్‌ కే ఎంటర్‌ ప్రైజస్‌లో ఎస్‌ఐ నగీనా లు జాతీయ జెండాను అవిష్కరించారు.

చాగలమర్రి: స్థానిక పోలీసు స్టేషనలో ఎస్‌ఐ రాజారెడ్డి, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో తాహిర్‌హుసేన, తహసీల్దార్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ విజయ్‌కుమార్‌, పశువైద్య కేంద్రంలో ఏడీ వరప్రసాద్‌, విద్యుత కేంద్రంలో ఏఈ కృష్ణయ్య, రమణయ్య, హమాలీ యూనియన కేంద్రం వద్ద ఎస్‌ఐ రాజారెడ్డి, ఎమ్మార్సీ కార్యాలయం వద్ద ఎంఈవోలు అనూరాధ, న్యామతుల్ల, ఆయా పాఠశాలల వద్ద చైర్మనలు, హెచఎంలు, బీసీ సంఘం కార్యాలయం వద్ద అధ్యక్షుడు లక్ష్మీనారాయణగౌడ్‌, గ్రంథా లయాధికారి రామచంద్రుడు జాతీయ పతకాలను ఎగురవేశారు. ఆయా పాఠశాలల్లో విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని ఆకట్టుకున్నాయి.

కొలిమిగుండ్ల: స్థానిక పోలీస్‌స్టేషనలో సీఐ రమేష్‌బాబు, తహసీల్దార్‌ కార్యాల యంలో తహసీల్దార్‌ విశ్వసాయితేజ, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ నాగలక్ష్మీ, ఎంపీడీవో దస్తగిరిబాబు, సచివాలయంలో గ్రామసర్పంచ శివ, మోడల్‌స్కూల్లో ప్రిన్సిపాల్‌ సంజీవరెడ్డి, కేజీబీవీలో పీవో లక్ష్మీసరోజ, గొర్విమానుపల్లె ఉన్నతపాఠశాలలో నంద్యాల జిల్లా ఎం పీటీసీల సంఘం అధ్యక్షుడు పులిప్రకాష్‌రెడ్డి, ఎంఈవో కార్యాలయంలో ఎంఈవో అబ్దుల్‌కలాంలు జాతీయ జెండాను ఆవిష్కరించారు.

దొర్నిపాడు: స్థానిక తహసీల్దార్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ సుభద్ర, పోలీసు స్టేషనలో ఎస్‌ఐ శ్రీకాంత, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ అమర్‌నాథ్‌రెడ్డి, సహకార సంఘ సొసైటీ కార్యాలయంలో సొసైటీ అధ్య క్షుడు సిద్ధి సత్యం, కొండాపురం సొసైటీ కార్యాలయంలో చైర్మన కుమ్మిత వెంకటేశ్వరమ్మ, వెలుగు కార్యాలయంలో ఏపీఎం బాబు, వైద్యశాలలో వైద్యాధికారి వెంకటశివ, దొర్నిపాడు, భాగ్యనగరం జడ్పీహెచ పాఠశాల లో హెచఎం చెన్నకేశ్వరి, ఎంఈవో మనోహర్‌రెడ్డి, గ్రంథాలయంలో గ్రంథాలయాధికారి అఖిలబేగం జాతీయ జెండాను ఎగురవేశారు.

ప్యాపిలి: స్థానిక తహసీల్దార్‌, ఎంపీడీవో, గ్రామపంచాయితీ, వెలుగు కార్యాలయాల్లో, రాచెర్ల ప్రియాసిమెంట్‌ పరిశ్రమలో, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో గణతంత్ర వేడుకలు నిర్వహించారు. ట్రైనీ డీఎస్పీ రాజసిం హారెడ్డి, సీఐ వెంకటరామిరెడ్డి, ఎస్‌ఐ నాగార్జున, ప్రియా సిమెంట్స్‌ సీజీ ఎం మల్లికార్జునరెడ్డి, పీఆర్‌వో కోటేశ్వరరావు, తహసీల్ధారు భారతి, ఎంపీ డీవో శ్రీనివాసరావు, ఏపీఎం క్రిష్ణమూర్తి, ఏపీవో రవీంద్ర పాల్గొన్నారు.

సంజామల: స్థానిక మండల పరిషత కార్యాలయంలో ఎంపీడీవో సాల్మన, తహసీల్దార్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ అనిల్‌ కుమార్‌, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎంఈఓ వెంకటరమణ రెడ్డి, జూనియర్‌ కళాశాలలో ప్రిన్సిపల్‌ సాలేహ, ప్రభుత్వ పిహెచసిలో డాక్టర్‌ కృష్ణకుమారి, పోలీస్‌ స్టేషనలో ఎస్‌ఐ రమణయ్య, బీసీ హాస్టల్‌లో సంక్షేమ అధికారి మునిరాజు జాతీయ జెండాను ఆవిష్కరించారు. టీడీపీ నాయకులు మల్కి హుస్సేన, మద్దిలేటి, మంచాల మద్దిలేటి రెడ్డి, శంకర్‌ రెడ్డి, ముసాని చంద్రశేఖర్‌ రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Jan 27 , 2026 | 12:29 AM