ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు..
ABN , Publish Date - Jan 27 , 2026 | 12:31 AM
నగరంలోని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాల్లో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. బి.క్యాంపు ప్రభుత్వ ఒకేషనల్ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్ నాగస్వామి నాయక్ జాతీయ జెండాను ఎగురవేశారు.
కర్నూలు, కోడుమూరు, పాణ్యం నియోజకవర్గాల్లో
జెండాను ఎగురవేసిన అధికారులు, నాయకులు
కర్నూలు ఎడ్యుకేషన్, జనవరి 26 (ఆంధ్రజ్యోతి): నగరంలోని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాల్లో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. బి.క్యాంపు ప్రభుత్వ ఒకేషనల్ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్ నాగస్వామి నాయక్ జాతీయ జెండాను ఎగురవేశారు. అధ్యాపకులు ప్రసన్నకుమార్, రామకృష్ణ, విజయశేఖర్, బోధనేతర సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.
ఎ.క్యాంపు మైఫర్ ఫార్మసీ కళాశాలలో ప్రిన్సిపాల్ డా.ఎం. రాజ్‌కుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. వైస్ ప్రిన్సిపాల్ డా .కాసర్ల సురేష్, బీఈడీ కళాశాల ప్రిన్సిపాల్ బి.ప్రకాష్, అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు. కేవీఆర్ పాఠశాలలో ప్రిన్సిపాల్ సాధు శ్రీనివాసరెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ రవికుమార్ పాల్గొన్నారు. మాధవీనగర్, రెవెన్యూ కాలనీల్లోని రవీంద్ర పాఠశాలలో కరస్పాండెంట్ సుబ్బయ్య, వైస్ ప్రిన్సిపాల్ శారదదేవి, కోఆర్డినేటర్ అక్తర్‌బేగం, సుభద్ర, సౌజన్య, బాలు, నాగేంద్ర పాల్గొన్నారు. సోమిశెట్టినగర్ హరిజోన్స్ ప్లే స్కూల్‌లో చైర్మన్ ప్రదీ్‌ప్ కుమార్, డైరెక్టర్ పావని నిర్వహించారు. ఐఐఐటీ డీఎంలో రిపబ్లిక్ డే వేడుకలకు ఏసీబీ విశ్రాంత అదనపు సూపరింటెండెంట్ ఆర్.వెంగన్న చౌదరి హాజరయ్యారు. ఎన్‌ఎ్‌సఎ్‌స, ఎన్‌ఎ్‌సవో ఐఐఐటీ డీఎం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. డ్రైరెక్టర్ మూర్తి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. రిడ్జ్ పాఠశాలలో సీఈవో గోపినాథ్ జాతీయ జెండాను ఎగురవేశారు. డీన్ రాజేంద్రన్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. కేశవరెడ్డి పాఠశాలలో ఎన్.కేశవరెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు.
కర్నూలు కలెక్టరేట్: కలెక్టరేట్ భవనంపై జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ జాతీయ జెండాను ఎగురవేశారు.
జిల్లా కోర్టులో పతాకావిష్కరణ చేసిన న్యాయాధికారి
కర్నూలు లీగల్: జిల్లా కోర్టు ఆవరణలో ప్రధాన న్యాయాధికారి జి.కబర్ది న్యాయ శాఖ సిబ్బంది, పోలీసుల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించిన అనంతరం జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అదనపు జిల్లా న్యాయాధికారులు కమలాదేవి, వాసు, లీలావతి, రాజేంద్రబాబు, శ్రీవిద్య, లక్ష్మీరాజ్యం, సీనియర్ సివిల్ న్యాయాధికారులు మల్లీశ్వరి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి, వెంకటేష్ నాయక్, న్యాయాధికారులు సరోజనమ్మ, అనిల్ కుమార్, అనిత, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు హరినాథ్ చౌదరి, ప్రధాన కార్యదర్శి ఎన్.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. జిల్లా వినియోగదారుల కమిషన్ చైర్మన్ కరణం కిషోర్ కుమార్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. సభ్యులు ఎన్.నారాయణరెడ్డి, నజీమా కౌసర్, న్యాయవాదులు పాల్గొన్నారు. పంచలింగాలలోని జిల్లా జైలులో న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకటశేషాద్రి హాజరయ్యారు. ఆ తర్వాత ఆయన మహిళా జైలును కూడా తనిఖీ చేశారు. ఉప లోకాయుక్త పి. రజని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పాతబస్టాండులో వై.జయరాజు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.