Share News

ఆక్రమణల నుంచి వైదొలగండి లేకుంటే తీసేస్తాం

ABN , Publish Date - Jul 10 , 2026 | 12:23 AM

నగర పరిధిలోని కేసీ కెనాల్‌ బండ్‌పై ఉన్న ఆక్రమణలను సంబంధిత వ్యకులు స్వచ్ఛందంగా తొలగించాలని, లేనిపక్షంలో అధికారులు తొలగిస్తారని నగర పాలక కమిషనర్‌ చల్లా ఓబులేసు హెచ్చరించారు. గురువారం ఆయన జొహరాపురం నుంచి ఆనంద్‌ టాకీసు దాకా కేసీ కెనాల్‌కు ఇరువైపులా ఉన్న ఆక్రమణలు, గుర్రపు డెక్క మొక్కలను పరిశీలించి, వాటి తొలగించాలని అధికారులను ఆదేశించారు.

ఆక్రమణల నుంచి వైదొలగండి లేకుంటే తీసేస్తాం
షరాఫ్‌ బజార్‌లో పరిశుభ్రతను పరిశీలిస్తున్న కమిషనర్‌ ఓబులేసు

పరిశుభ్రతలో షరాఫ్‌ బజార్‌ ఆదర్శం

నగర పాలక సంస్థ కమిషనర్‌ చల్లా ఓబులేసు

కర్నూలు న్యూసిటీ, జూలై 9(ఆంధ్రజ్యోతి): నగర పరిధిలోని కేసీ కెనాల్‌ బండ్‌పై ఉన్న ఆక్రమణలను సంబంధిత వ్యకులు స్వచ్ఛందంగా తొలగించాలని, లేనిపక్షంలో అధికారులు తొలగిస్తారని నగర పాలక కమిషనర్‌ చల్లా ఓబులేసు హెచ్చరించారు. గురువారం ఆయన జొహరాపురం నుంచి ఆనంద్‌ టాకీసు దాకా కేసీ కెనాల్‌కు ఇరువైపులా ఉన్న ఆక్రమణలు, గుర్రపు డెక్క మొక్కలను పరిశీలించి, వాటి తొలగించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ ప్రజారోగ్య పట్టణ ప్రణాళిక విభాగ అధికారుల సమన్వయంతో కేసీ కెనాల్‌ పరిసరాలను మరింత పరిశుభ్రంగా, సుందరంగా తీర్చిదిద్దాలని సూచించారు, గుర్రపు డెక్క మొక్కల తొలగింపు పనులను తక్షణమే చేపట్టాలని ఆదేశించారు. ఆ పనులు పూర్తయ్యే వరకు దోమ నివారణ కోసం డ్రోన్‌ ద్వారా లార్వీసైడ్‌ మందును పిచికారీ చేయాలని అధికారులను ఆదేశించారు. కేసీ కెనాల్‌ బండ్‌పై ఆక్రమణలను అనుమతించబోమని స్పష్టం చేశారు. అక్కడ స్థలాలను ఆక్రమించుకున్న వ్యక్తులు వెంటనే స్వచ్ఛందంగా తొలగించాలని ఆదేశించారు. అనంతరం నగరంలోని పలు ప్రాంతాల్లో పారిశుధ్య నిర్వహణను పరిశీలించారు. షరాఫ్‌ బజార్‌లో ప్రతి వాణిజ్య దుకాణం వద్ద డస్ట్‌ బిన్‌ ఏర్పాటు చేసి పరిశుభ్రతను పాటిస్తున్న తీరుపై కమిషనర్‌ సంతృప్తి వ్యక్తం చేశారు. షరాఫ్‌ బజార్‌ను ఆదర్శంగా తీసుకుని నగరలోని దుకాణదారులు తప్పనిసరిగా డస్ట్‌ బిన్‌ ఏర్పాటు చేసుకుని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. అనంతరం కొండారెడ్డి బురుజు వద్ద ఉన్న అన్న క్యాంటీన్‌ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఈ జే. రమణమూర్తి, ప్రజారోగ్య అధికారి డా.ఎం. రఘు, శానిటరీ సూపర్‌వైజర్‌ రమే్‌షబాబు, అధికారులు జిలానీ, నాగేశ్వరరావు, ఫరూక్‌, హుస్సేన్‌, అనిల్‌, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 10 , 2026 | 12:24 AM