ఆక్రమణల తొలగింపు
ABN , Publish Date - Apr 03 , 2026 | 11:27 PM
కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల ఎదుట రోడ్డును ఆక్రమించుకున్న షాపులను ట్రాఫిక్ సీఐ మన్సూరుద్దీన్ ఆధ్వర్యంలో శుక్రవారం తొలగించారు.
కర్నూలు జీజీహెచ్ ఎదుట ట్రాఫిక్ క్రమబద్ధీకరణ
కర్నూలు హాస్పిటల్, ఏప్రిల్ 3 (ఆంధ్రజ్యోతి): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల ఎదుట రోడ్డును ఆక్రమించుకున్న షాపులను ట్రాఫిక్ సీఐ మన్సూరుద్దీన్ ఆధ్వర్యంలో శుక్రవారం తొలగించారు. కర్నూలు సర్వజన వైద్యశా లకు ఏడు జిల్లాల నుంచి రోగులు వస్తుం టారు. ముఖ్యంగా ఇన్‌గేట్ దగ్గర ఇరువైపు ల రోడ్డును ఆక్రమించుకుని కొందరు షాపులను ఏర్పాటు చేసుకోవడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తున్నారు. వాస్తవానికి ఆసుపత్రి ఎదుట ఉన్న ఫుట్‌పాత్‌లను ఆక్రమించుకుని కొందరు షాపులను ఏర్పాటు చేసుకున్నారు. కానీ రోగుల రద్దీ దృష్ట్యా ఫుట్‌పాత్‌ల వద్ద ఉన్న షాపుల ఎదుట రోడ్డును ఆక్రమించుకున్నారు. దీంతో ఆసుపత్రి ఇన్‌గేట్, రివాల్వింగ్ గేటు వద్ద అక్రమంగా ఉన్న షాపుల వల్ల ఆటోలు, అక్కడే నిలిచి ఉండటంతో రోగులతో పాటు ప్రయాణికులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారు. ఇన్‌గేటు ఎదుట పండ్లు వ్యాపారులు రోడ్డును ఆక్రమించుకుని వ్యాపారాలు సాగిస్తున్నారు. ప్రజల నుంచి ఫిర్యాదులు రావడంతో ట్రాఫిక్ సీఐ, నగర పాలక మున్సిపల్ సిబ్బంది పోలీసుల సహకారంతో ఆక్రమిత దుకాణాలను తొలగించి ఆ వ్యర్థాలు, సామగ్రిని ట్రాక్టర్లలో తరలించారు. ఇన్‌గేటు వద్ద ఉన్న రెండు గేట్లలో ఒకదాన్ని మూసివేయడం వల్ల ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలుగుతోందని, రెండో గేటు కూడా తెరవాలని రోగులు కోరుతున్నారు.