22ఏ, చుక్కల భూముల రైతులకు ఊరట
ABN , Publish Date - Apr 10 , 2026 | 10:54 PM
జిల్లాలో ఎన్నో ఏళ్ల కిందట నుంచి ఉన్న 22ఏ, చుక్కలభూముల కింద ఉన్న పలు సమస్యలను జిల్లా యంత్రాంగం డ్రైవ్ మోడల్‌లో క్లియర్ చేసింది.
నేడు పీజీఆర్‌ఎస్‌లో పత్రాలు పంపిణీ
నంద్యాల నూనెపల్లి, ఏప్రిల్ 10 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో ఎన్నో ఏళ్ల కిందట నుంచి ఉన్న 22ఏ, చుక్కలభూముల కింద ఉన్న పలు సమస్యలను జిల్లా యంత్రాంగం డ్రైవ్ మోడల్‌లో క్లియర్ చేసింది. ఏళ్ల నుంచి పీజీఆర్‌ఎస్‌కు, రెవెన్యూ క్లినిక్‌కు వస్తున్న సమస్యలను పరిగణలోని తీసుకొని 2026 మార్చి 30,31 తేదీల్లో స్పెషల్ డ్రైవ్ టెకఫ్ చేసి సమస్యలకు విముక్తి కలిగించారు. జిల్లాలో దాదాపు 111 మంది రైతులకు సంబంధించి 247.269 ఎకరాల 22ఏ, చుక్కల భూముల కిందనున్న సమస్యలను క్లియర్ చేయడంతో రైతులకు ఊరట కలిగింది. ఈ జాబితాను ఆన్‌లైన్‌లో సైతం అప్‌లోడ్ చేశారు. శనివారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాల్‌లో కలెక్టర్ రాజకుమారి ఆధ్వర్యంలో రైతులకు పత్రాలు ఇవ్వనున్నారు.
ప్రత్యేక శ్రద్ధతో..
పొజిషన్ సబ్ డివిజన్ సమస్యలు ఉన్నాయా, లింక్ డాక్యుమెంట్ సమస్యలు ఉన్నాయా.. అనుభవంలో ఎవరూ ఉన్నారు. అసలు ఉన్నా రా లేరా అని పాత రికార్డులను చూసుకొని ప్రత్యేక శ్రద్ధతో డ్రైవ్ చేసి, కోర్టు కేసులు ఏమైనా నడుస్తున్నాయా లేదా కుటుంబ తగాదాలు ఉన్నాయా అని చూసుకొని డ్రైవ్ మోడల్‌లో క్లియర్ చేశారు.
డివిజన్ పిటీషనర్స్ ఎకరాలు
నంద్యాల 42 మంది 111.132
ఆత్మకూరు 49 మంది 85.104
డోన్ 14 మంది 29.203
బనగానపల్లి ఆరుగురు 21.83