Share News

22ఏ జాబితాలోని భూములకు విముక్తి

ABN , Publish Date - Jul 10 , 2026 | 12:03 AM

గత వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పిదం వల్ల బేతంచెర్ల మండలం గూటుపల్లెకు చెందిన రైతుల సమస్యను పరిష్కరిస్తూ వారి భూములకు సీఎం చంద్రబాబునాయుడు విముక్తి కలిగించారు.

 22ఏ జాబితాలోని భూములకు విముక్తి
గూటుపల్లె రైతులకు పట్టాదారు పుస్తకాలు పంపిణీ చేస్తున్న సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి

గూటుపల్లె రైతులతో ముఖాముఖిలో సీఎం

బనగానపల్లె, జూలై 9 (ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పిదం వల్ల బేతంచెర్ల మండలం గూటుపల్లెకు చెందిన రైతుల సమస్యను పరిష్కరిస్తూ వారి భూములకు సీఎం చంద్రబాబునాయుడు విముక్తి కలిగించారు. ఈమేరకు బనగానపల్లె తహసీల్దారు కార్యాలయంలో గూటుపల్లె రైతులతో సీఎం ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. రోడ్లు భవనాల శాఖా మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి, జిల్లా కలెక్టరు రాజకుమారి, బేతంచెర్ల మండలం గూటుపల్లెలో 215 సర్వేనంబరులో 2669 ఎకరాల రైతుల భూమిని 22ఏ కింద అనగా ప్రభుత్వ భూమిగా గత వైసీపీ ప్రభుత్వం చేర్చింది. దీంతో రైతులు రుణాలు అందక, అమ్ముకోవడానికి వీలులేక నానా ఇబ్బందిపడ్డారు. సర్వీసు ఇనాం భూముల రిజిస్ట్రేషన్‌ చట్టం 1908 కింద ఈ భూములను 22ఏలో చేర్చడంతో పాటు 426 వక్ఫ్‌బోర్డు భూములను సైతం నిషేధిత జాబితాలో చేర్చారు. రైతులు ఈ సమస్యపై ఈ ఏడాది మార్చిలో సీఎం చంద్రబాబునాయుడుకు వినతిపత్రం ఇచ్చారు. దీంతో ఈ భూములను నిషేధిత జాబితా నుంచితొలగించారు. బనగానపల్లె తహసీల్దారు కార్యాలయంలో వెబ్‌సైట్‌ నుంచి 2074 ఎకరాలను 22 ఏ నుంచి తొలగించేలా సీఎం ఆదేశాలు జారీ చేశా రు. చంద్రబాబుసమక్షంలో రెవిన్యూ శాఖ అధికారిక ప్రక్రియ చేపట్టింది. నిషేధంలో పెట్టిన ఆ భూములను నిషేధిత జాబితా నుంచి కలెక్టరు, జిల్లా రిజిస్ట్రార్లు నిషేధిత జాబితానుంచి సీఎం సమక్షంలో తొలగించారు. 22ఏ జాబితా నుంచి వక్ఫ్‌ భూములను తొలగించడంతో 897 మంది రైతులకు లబ్ధి కలిగింది. స్థానిక తహసీల్దారు కార్యాలయంలో లబ్ధి పొందిన రైతులతో సీఎం చంద్రబాబునాయుడు ముఖాముఖి మాట్లాడారు. గత వైసీపీ పాలనలో నిషేధిత జాబితాలో పెట్టిన తమ భూములను తిరిగి ఇప్పించిన సీఎం చంద్రబాబునాయుడుకు ధన్యవాదాలు తెలిపారు.

Updated Date - Jul 10 , 2026 | 12:03 AM