Share News

విదేశీయుల వివరాల నమోదు తప్పనిసరి

ABN , Publish Date - Oct 09 , 2026 | 11:03 PM

విద్య, వైద్యం, పర్యాటకం, వ్యాపారం, ఇతర అవసరాల నిమిత్తం వచ్చే విదేశీయులకు ఆశ్రయం కల్పించే హోటళ్లు, హాస్టళ్లు, గెస్ట్‌హౌ్‌సలు, విద్యాసంస్థలు, ఆసుపత్రులు, అద్దె ఇంటి, ఆస్తుల యజమానులు తమ వద్దకు వచ్చే విదేశీయుల వివరాలను తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో 24 గంటల్లోపు నమోదు చేయాలని ఎస్పీ సునీల్‌షెరాన్‌ తెలిపారు.

విదేశీయుల వివరాల నమోదు తప్పనిసరి

ఎస్పీ సునీల్‌ షెరాన్‌

నంద్యాల నూనెపల్లి, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): విద్య, వైద్యం, పర్యాటకం, వ్యాపారం, ఇతర అవసరాల నిమిత్తం వచ్చే విదేశీయులకు ఆశ్రయం కల్పించే హోటళ్లు, హాస్టళ్లు, గెస్ట్‌హౌ్‌సలు, విద్యాసంస్థలు, ఆసుపత్రులు, అద్దె ఇంటి, ఆస్తుల యజమానులు తమ వద్దకు వచ్చే విదేశీయుల వివరాలను తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో 24 గంటల్లోపు నమోదు చేయాలని ఎస్పీ సునీల్‌షెరాన్‌ తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. విదేశీయుల రాకపోకల వివరాలను సంబంధిత ఎఫ్‌ఆర్‌ఆర్‌వో, ఎఫ్‌ఆర్‌వో ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ జారీ చేసిన నిబంధనల ప్రకారం.. విదేశీయులు తమ వద్దకు వచ్చిన తేదీ, పాస్‌పోర్ట్‌, వీసా తదితర వివరాలను సంబంధిత ఫారంలో నమోదు చేసి సమర్పించాలన్నారు. అలాగే నేపాల్‌, భూటాన్‌ పౌరులు, ఓసీఐ కార్డు కలిగిన (భారతీయులు) తప్పనిసరిగా బ్యూరో ఆఫ్‌ ఇమ్మిగ్రేషన్‌ పోర్టల్‌లోని ఫారం-3 ద్వారా వారు వచ్చిన, బస చేసిన, నిష్క్రమణ పూర్తి వివరాలు ఎఫ్‌ఆర్‌వోకు తెలపాలన్నారు. విదేశీయుల వివరాలు నమోదు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తే క్రిమినల్‌ కేసులు నమోదు చేయడంతో పాటు జరిమానా రూ.50 వేల నుంచి లక్ష వరకు, రెండు నుంచి ఐదేళ్ల వరకు జైలు శిక్ష పడవచ్చని తెలిపారు. విదేశాల్లో స్థిరపడిన (ఓసీఐ కార్డు కలిగిన భారతీయులు) దేశంలో నిర్వహించే ఎన్నికల్లో పోటీ చేయకూడదని, ఓటు వేయకూడదని, వ్యవసాయ భూముల కొనుగోలు చేయకూడదని తెలిపారు.

Updated Date - Oct 09 , 2026 | 11:03 PM