Share News

మై భారత్‌ పోర్టల్‌లో నమోదు చేయండి

ABN , Publish Date - Jul 31 , 2026 | 12:00 AM

మై భారత్‌ పోర్టల్‌లో నమోదు చేయండి

మై భారత్‌ పోర్టల్‌లో నమోదు చేయండి
కలెక్టర్‌ రాజకుమారి

కలెక్టర్‌ రాజకుమారి

నంద్యాల నూనెపల్లి, జూలై 30 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో 16 నుంచి 29 సంవత్స రాల వయస్సు గల యువతను మై భారత్‌ పోర్టల్‌లో నమోదు చేయాలని కలెక్టర్‌ రాజకు మారి సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్‌ క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. ఈ కార్యక్రమాన్ని జిల్లా ఎంప్లాయిమెంట్‌ అండ్‌ స్కిల్‌, స్కిల్‌ డెవలప్‌మెంట్‌, డీఎస్‌డీఓలు సమ న్వయంతో విస్తృతంగా చేప ట్టాలని ఆదేశించారు. జిల్లా విద్యాశాఖ, వృత్తి విద్యాశాఖ, డిగ్రీ కళాశాలల కన్వీనర్లు తమ పరిధిలోని విద్యార్థులందరినీ పోర్టల్‌లో నమోదు చేయించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించా లన్నారు. యువతలో సృజనాత్మకత, సామాజిక చైతన్యం పెంచేందుకు పెయింటింగ్‌, వ్యాసర చన, క్విజ్‌, నృత్యపోటీలు తదితర కార్యక్రమాలను నిర్వహించాలన్నారు.

కెపాసిటీ బిల్డింగ్‌ శిక్షణను వినియోగించుకోవాలి

జిల్లా అభివృద్ధి ప్రణాళికల రూపకల్పనలో భాగంగా నిర్వహించనున్న కెపాసిటీ బిల్డింగ్‌ శిక్షణ కార్యక్రమాలను అధికారులు పూర్తిస్థాయిలో విని యోగించుకొని జిల్లాకు సమగ్ర అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్‌ రాజకుమారి తెలిపారు. గురువారం ప్లానింగ్‌ శాఖ కార్యదర్శి పీయూష్‌కుమార్‌ విజయవాడ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరె న్స్‌లో కలెక్టరేట్‌లోని మినీ వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌ నుంచి కలెక్టర్‌ పాల్గొ న్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్లానింగ్‌ శాఖ ఆధ్వర్యంలో ఆగస్టు 1 నుంచి 13 వరకు నిర్వహించనున్న కెపాసిటీ బిల్డింగ్‌ శిక్షణా కార్యక్రమంలో జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయి అధికారులకు గ్రాస్‌ స్టేట్‌ డొమెస్టిక్‌ ప్రొడక్ట్‌, గ్రాస్‌ డిస్ర్టిక్ట్‌ డొమెస్టిక్‌ ప్రొడక్ట్‌, గ్రాస్‌ వ్యాల్యూ యాడెడ్‌ వంటి అంశాలపై సమగ్ర అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు.

Updated Date - Jul 31 , 2026 | 12:00 AM