తగ్గిన వేరుశనగ ధర
ABN , Publish Date - Mar 22 , 2026 | 11:11 PM
ఎమ్మిగనూరు వ్యవసా య మార్కెట్‌లో వేరుశనగ ధరలు తగ్గుతున్నాయి.
ఎమ్మిగనూరు, మార్చి 22(ఆంధ్రజ్యోతి): ఎమ్మిగనూరు వ్యవసా య మార్కెట్‌లో వేరుశనగ ధరలు తగ్గుతున్నాయి. రెండు వారాలతో పోల్చితే దాదాపు క్వింటానికి రూ. వెయ్యి నుంచి రూ. 1500 మేర త గ్గింది. ఆదివారం వ్యవసాయ మార్కెట్‌లో క్వింటం వేరుశనగ గరిష్ఠ ధర రూ. 8070 పలికింది. గత వారంలో రూ. 9వేల నుంచి రూ.10 వేల మధ్యలో పలికింది. ఉగాది, రంజాన్ పండుగలు రావటంతో మార్కెట్‌కు నాలుగురోజులుకు పైగా సెలవులు వచ్చాయి. దీంతో వేరుశనగ ధర పె రుగుతుందనుకున్నప్పటికీ మరింత తగ్గటం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. ఆదివారం మార్కెట్‌కు ఎమ్మిగనూరు చుట్టుముట్టు ప్రాం తాలతో పాటు ఆయా మండలాలోని గ్రామాల నుంచి 8127 బస్తాల పంట ఉత్పత్తులు అమ్మకానికి వచ్చాయి. ఇందులో వేరుశనగ 7826 బ స్తాలు (2,348క్వింటాళ్లు) రాగా మధ్యస్థ ధర రూ. 6970, కనిష్ఠం రూ. 3481 పలి కింది. అలాగే ఆముదాలు 241 బస్తాలు రాగా క్వింటం గరిష్ఠ ధర రూ. 5974, కనిష్ఠ ధర రూ. 5483 పలికింది. కందులు 16 బస్తాలు రాగా గరిష్ఠం రూ. 6720, కనిష్ఠం రూ. 4230 పలికింది. మొక్కజొన్న 18 బ స్తాలు రాగా ధర రూ. 1300, శనగలు 26 బస్తాలు రాగా గరిష్ఠం ధర రూ. 4870, కనిష్ఠం రూ. 4730 పలికింది. కాగా మార్కెట్‌కు వేరుశనగతో పాటు ఇతర పంట ఉత్పత్తులు 8127 బస్తాల(2,498క్వింటాళ్లు)ను రైతులు అమ్మకానికి తరలించటంతో మార్కెట్ పంట ఉత్పత్తులతో కళకళలాడింది.