Share News

పన్ను ఎగవేతదారులకు రెడ్‌ నోటీసులు

ABN , Publish Date - Feb 04 , 2026 | 12:31 AM

ఏడాదికి పైగా పన్నులు చెల్లించని మొండి బకాయిదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్‌ పి.విశ్వనాథ్‌ ఆదేశించారు.

పన్ను ఎగవేతదారులకు రెడ్‌ నోటీసులు
మాట్లాడుతున్న కమిషనర్‌ విశ్వనాథ్‌

కర్నూలు న్యూసిటీ, ఫిబ్రవరి 3(ఆంధ్రజ్యోతి): ఏడాదికి పైగా పన్నులు చెల్లించని మొండి బకాయిదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్‌ పి.విశ్వనాథ్‌ ఆదేశించారు. మంగళవారం కార్యాలయంలో నోడల్‌ అధికారులు, రెవెన్యూ సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. దీర్ఘకాలికంగా పన్నులు చెల్లించని వారికి రెడ్‌ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. నోటీసులు అందుకున్నా, గడువులోపు బకాయిలు చెల్లించని పక్షంలో కుళాయి కనెక్షన్లు నిలిపివేస్తామని హెచ్చరించారు. పన్నులు చెల్లించడం పౌరుల బాధ్యత అని, స్వచ్ఛందంగా బకాయిలు చెల్లించి నగర అభివృద్దికి సహకరించాలని కోరారు. అడిషనల్‌ కమిషనర్‌ ఆర్‌జీవి.కృష్ణ, డి.సి. సతీ్‌షకుమార్‌రెడ్డి, ఆర్‌వోలు జునైద్‌, స్వర్ణలత,వాజిద్‌, కార్యదర్శి నాగరాజు, ఎంఈ గిరిరాజు, డీఈఈలు పవన్‌, క్రిష్ణలత, నరేష్‌ పాల్గొన్నారు.

Updated Date - Feb 04 , 2026 | 12:31 AM