వైసీపీ నాయకులపై రెడ్ బుక్ రాజ్యాంగం అమలు
ABN , Publish Date - Jan 18 , 2026 | 12:59 AM
రాష్ట్రంలోని వైసీపీ నాయకులు, కార్యకర్తలపై కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తోందని వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్‌రెడ్డి ఆరోపించారు.
జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్‌రెడ్డి
కర్నూలు న్యూసిటీ, జనవరి 17(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని వైసీపీ నాయకులు, కార్యకర్తలపై కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తోందని వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్‌రెడ్డి ఆరోపించారు. పల్నాడు జిల్లా పిన్నెల్లిలో వైసీపీ కార్యకర్త మండా సాల్మన్ హత్యకు కూటమి ప్రభుత్వమే కారణమంటూ శనివారం పాతబస్టాండులోని డా.బీఆర్.అంబేడ్కర్ విగ్రహం ఎదుట నిరసన తెలిపారు. ఈ కార్యక్రమానికి పిన్నెల్లి ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ హాజరయ్యారు. ఎస్వీ మాట్లాడుతూ అధికార బలంతో వైసీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని, దాడులు, బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రత్యేకంగా దళితులపై జరగుతున్న అణచివేత తీవ్ర ఆందోళనకరంగా మారిందన్నారు. హత్య చేసిన వారిని వెంటనే గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి, కార్పొరేటర్ కురవ మునెమ్మ, నాయకుడు రాంపుల్లయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు.