Share News

రికార్డులు దాచేశారు..!

ABN , Publish Date - May 21 , 2026 | 10:54 PM

ఖజానా శాఖలో నిబంధనలకు అధికారులు తూట్లు పొడుస్తున్నారు. అవినీతికి అడ్డాగా మార్చారు. లక్షల రూపాయలు తీసుకొని అక్రమంగా పదోన్నతులు ఇచ్చారు.

రికార్డులు దాచేశారు..!
జిల్లా ట్రెజరీ కార్యాలయం

ఖజానా శాఖలో అక్రమ పదోన్నతులు

జీవో నెం: 22ను తూట్లు పొడిచిన అధికారులు

చేతులు మారిన లక్షల రూపాయలు

అటెండర్లు, రికార్డు అసిస్టెంట్లకు ప్రమోషన్లు

లబోదిబోమంటున్న సీనియర్లు

సెలవుపై వెళ్లిన జిల్లా ట్రెజరీ అధికారి

ఖజానా శాఖలో నిబంధనలకు అధికారులు తూట్లు పొడుస్తున్నారు. అవినీతికి అడ్డాగా మార్చారు. లక్షల రూపాయలు తీసుకొని అక్రమంగా పదోన్నతులు ఇచ్చారు. ఉద్యోగుల సర్వీసు రూల్స్‌, సీనియారిటీని కాపాడాల్సిన చోటే అక్రమ పదోన్నతుల పర్వం కొనసాగింది. 2011లో ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో. నెం.22ను తుంగలో తొక్కా రు. కొందరు అధికారులు తమకు నచ్చినవారికి, ముడుపులిచ్చినా వారికి ఇష్టారాజ్యంగా ప్రమోషన్లు కట్టబెట్టారనే ఆరోపణలున్నాయి. ప్రస్తుతం ఈపదోన్నతుల వ్యవహారం ఆశాఖలో కలకలం రేపుతోంది. విచారణకు కమిటీ ఏర్పాటు చేశారు. ఆకమిటీకి రికార్డులు అందించకుండా కొందరు అధికారులు వాటిని దాచేశారు.

కర్నూలు కలెక్టరేట్‌, మే 21(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఖజానా శాఖలో అక్రమ ప దోన్నతులపై విచారణ కమిటీ ఏర్పాటైంది. అటెండర్‌ స్థాయి నుంచి సీనియర్‌ అకౌంటెంట్‌ స్థాయి వరకు జరిగిన ఈప్రమోషన్లలో లక్షలాది రూపాయల లావా దేవీలు జరిగినట్లు ఉద్యోగ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఈ నెల 16 నుంచి అక్రమంగా పదోన్నతి పొందిన సదురు 20మంది ఉద్యోగుల సర్వీసు రిజిస్టర్లను (ఎస్‌ఆర్‌లు) కమిటీ పరిశీలించాల్సి ఉంది. విచారణ కమిటీకి సంబం ధిత విభాగాల నుంచి ఎలాం టి రికార్డులు అందడం లేదని సమాచారం. కావాలనే రికార్డులను దాచేస్తూ విచా రణను నీరుగార్చే ప్రయత్నం జరుగుతోందని ఉద్యోగులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు.

ప్రమోషన్‌ ఇవ్వాలంటే నిర్ధిష్టమైన..

ప్రభుత్వ నిబంధనల ప్రకారం ట్రెజరీ శాఖలో అటెం డర్‌, రికార్డు అసిస్టెంట్‌కు జూనియర్‌ అకౌంటెంటుగా ప్రమోషన్‌ ఇవ్వాలంటే నిర్ధిష్టమైన కోటా ఉంటుంది. జీవో.22 ప్రకారం ప్రతి ఆరు పోస్టుల్లో కేవలం ఒక పోస్టును మాత్రమే (5!1 నిష్పత్తి) పదోన్నతి ద్వారా భర్తీ చేయాలి. ప్రమోషన్‌ పొందే ఉద్యోగికి ఆ కేడర్‌లో కనీసం రెం డేళ్ల సీనియారిటీ తప్పనిసరి. 2011 నుంచి 2025 వరకు జిల్లా ట్రెజరీ కార్యాలయంలో ఈ నిబంఽ దనలను అటకెక్కించారు. వంద శాతం పోస్టులను అటెండర్లు, రికార్డు అసి స్టెంట్లకే కట్టబెడుతూ జిల్లా అధికారులు చక్రం తిప్పారన్న ఆరోపణలు న్నాయి. నిబంధనలకు విరుద్ధంగా 20 మందికి పైగా జూనియర్‌, సీనియర్‌ అకౌంటెంట్లుగా అక్రమ ప్రమోషన్లను ఇచ్చారనే దారుణం వెలుగు చూసింది.

సీనియర్లకు అన్యాయం

అడ్డదారిలో ప్రమోషన్లు పొందిన వారితో నిజాయితీగా పరీక్షలు రాసి.. డైరెక్టు రిక్రూట్‌మెంటు ద్వారా వచ్చిన జూనియర్‌ అకౌంటెంట్లు, ఏపీపీఎస్‌సీ ద్వారా ఎంపికైన సీనియర్‌ అకౌంటెంట్లు నష్టపోయారు. అర్హత, సీనియారిటీ ఉన్నప్పటికీ వారిని వెనక్కి నెట్టి, అర్హత లేనివారికి పదోన్నతులిచ్చారు. దీని ప్రభావం కేవలం జిల్లా స్థాయిలోనే కాకుండా జోనల్‌ వ్యవస్థపై కూడా పడింది. అర్హులైన సీనియర్ల భవిష్యత్తు ప్రమోష న్లకు అడ్డంకులు ఏర్పడే ప్రమాదముందని ఉద్యోగ సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.

వార్షిక తనిఖీల్లో.. : రాష్ట్ర ట్రెజరీ ఉన్నతాధికారులు వార్షిక తనిఖీలు నిర్వహించిన సమయంలోనే ఈ పదోన్నతులపై అభ్యంతరాలు వ్యక్తంచేసినట్లు సమాచారం. నిబంధనల ఉల్లం ఘ నను ఎత్తి చూపినప్పటికీ జిల్లాస్థాయి అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహ రించడం వెనుక ఉన్న అదృశ్య హస్తం ఎవరిదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ వ్యవహారంపై పెద్దఎత్తున విమర్శలు రావడంతో జిల్లా ట్రెజరీ అధికారి రామచం ద్రరావు ఈఏడాది ఏప్రిల్‌ 25న ఒక ఉన్నతస్థాయి విచారణ కమిటీనీ ఏర్పాటుచేశారు. కమిటీ ఏర్పాటయ్యాక ఆయన సెలవుపై వెళ్లడం అనుమానాలకు తావిస్తోంది.

లక్షలాది రూపాయలు చేతలు మారాయని.. : అర్హతలేని వారికి ప్రమోషన్లు కట్టబెట్టడం వెనుక లక్షలాది రూపాయల అవినీతి సొమ్ము చేతులు మారాయని ఉద్యోగ వర్గాలు విమర్శిస్తున్నాయి. ప్రభుత్వ ఖజానా నిధులను జీతాల రూపంలో అక్రమార్కులకు కట్టబెడుతూ ప్రభత్వ సొమ్ముకు గండి కొడుతున్న లంచగొండి అధికారులపై అక్రమంగా ప్రమోషన్లు పొందిన వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

ఆరుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు

అటెండర్‌ నుంచి సీనియర్‌ అకౌంటెంట్లకు పదోన్నతి అంశాలపై ఫిబ్రవరి 26న జీవో 22 విడుదలైంది. అక్రమ పదోన్నతుల అంశాలపై జిల్లా ఖజానా శాఖలో ఆరు గురు సభ్యులతో ఏప్రిల్‌ 25న కమిటీ ఏర్పాటుచేశాం. పదోన్నతులు పొందిన వారి సర్వీసు రిజిస్టర్లను తనిఖీ చేశారు. విచారణ కమిటీ సభ్యులకు వారు సహకరించాలి. సహకరించిన వారిపై చర్యలు తీసుకుంటాం.

- సుబ్బరాయుడు, ఇన్‌చార్జి డీటీవో, కర్నూలు

Updated Date - May 21 , 2026 | 10:54 PM