Share News

పత్తి కొనుగోళ్లలో రికార్డు

ABN , Publish Date - Jan 10 , 2026 | 11:50 PM

గతంలో ఎన్నడూ లేని విధంగా సీసీఐ రైతుల నుంచి పెద్దమొత్తంలో పత్తిని కొనుగోలు చేసి రికార్డు సృష్టించింది.

పత్తి కొనుగోళ్లలో రికార్డు
పెంచికలపాడులో రైతుల నుంచి సేకరించిన పత్తి

రూ.566.48 కోట్లు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ

కర్నూలు అగ్రికల్చర్‌, జనవరి 10 (ఆంధ్రజ్యోతి): గతంలో ఎన్నడూ లేని విధంగా సీసీఐ రైతుల నుంచి పెద్దమొత్తంలో పత్తిని కొనుగోలు చేసి రికార్డు సృష్టించింది. ఖరీ్‌ఫలో కర్నూలు జిల్లాలో ఐదున్నర లక్షల ఎకరాల్లో పత్తిని రైతులు సాగుచేశారు. పెద్ద మొత్తంలో సాగైన పత్తిని సీసీఐ అధికారులు కొనుగోలు చేస్తారో.. లేదోనని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. కలెక్టర్‌ ఏ.సిరి, జేసీ నూరుల్‌ ఖమర్‌ ప్రత్యేక చర్యలు తీసుకుని వ్యవసాయ, మార్కెటింగ్‌, సీసీఐ శాఖల మధ్య సమన్వయం చేశారు. దీంతో శనివారం నాటికి 7,23,075 క్వింటాళ్ల పత్తిని రైతుల నుంచి కొనుగోలు చేసి రూ.566.48 కోట్ల వారి బ్యాంకు ఖాతాలకు జమ చేసేందుకు ఏర్పాట్లు పూర్తిచేశారు. గత నవం బరులో జిల్లాలోని 16 సీసీఐ కేంద్రాల్లో పత్తిని కొనుగోలు చేసే కార్యక్రమం మొదలైంది. ఇంత పెద్ద మొత్తంలో రైతుల నుంచి పత్తిని కొనుగోలు చేసి రైతులకు రూ.566 కోట్లు ఇవ్వడం ఇదే మొదటిసారి ఏడీఏం నారాయణమూర్తి తెలిపారు.

Updated Date - Jan 10 , 2026 | 11:50 PM