సోలార్ ప్రాజెక్టుకు భూములు గుర్తించండి
ABN , Publish Date - Jun 09 , 2026 | 12:30 AM
ఆదోని ప్రాంతంలో ఏర్పాటు చేయబోయే సోలార్ ప్రాజెక్టుకు భూములను గుర్తించేలా చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్, గనుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనా కలెక్టర్‌కు సూచించారు.
తొమ్మిది జిల్లాలతో తిరుపతి ఎకనామిక్ రీజియన్
ఎక్సైజ్, గనుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనా
కర్నూలు అర్బన్, జూన్ 8 (ఆంధ్రజ్యోతి): ఆదోని ప్రాంతంలో ఏర్పాటు చేయబోయే సోలార్ ప్రాజెక్టుకు భూములను గుర్తించేలా చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్, గనుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనా కలెక్టర్‌కు సూచించారు. సోమవారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్సు హాలులో తిరుపతి ఎకనమిక్ రీజియన్ ఏర్పాటులో భాగంగా జిల్లా సమగ్ర అభివృద్ధ్ది, తదితర అంశాలపై జిల్లా స్థాయి అధికారులతో ఆయన సమీక్షించారు. జిల్లాలో పారిశ్రామిక ప్రాంతానికి అనుబంధంగా భవిష్యత్ లో పట్టణాభివృద్ధి కోసం తగిన భూమిని ముందుగానే గుర్తించి రిజర్వు చేయాలని సూచించారు. పారిశ్రామిక అవసరాలకే కాకుండా, నివాస, వాణిజ్య, మౌలిక సదుపాయాల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని సమగ్ర అర్బన్ డెవల్‌పమెంట్ ప్రణాళికను రూపొందించాలని కలెక్టర్‌కు సూచించారు. ఆదోని ప్రాంతంలో ఏర్పాటు చేయబోయే పరిశ్రమలు, సోలార్ ప్రాజెక్టుకు తగిన భూమిని గుర్తించాలని అన్నారు. సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా రాయలసీమ, నెల్లూరు జిల్లాలతో తిరుపతి ఎకనామిక్ రీజియన్ ను ఏర్పాటు చేశామని అన్నారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు సమగ్ర అభివృద్ధి సాధించాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం విశాఖ, అమరావతి, తిరుపతి ఎకనామిక్ రీజియన్లను ఏర్పాటు చేసిందన్నారు. అలాగే 9 జిల్లాలతో తిరుపతి, నెల్లూరు, చిత్తూరు, అన్నమయ్య, కడప, నంద్యాల, కర్నూలు, అనంతపురం, సత్యసాయి జిల్లాలతో తిరు
పతి ఎకనమిక్ రీజియన్ ను ఏర్పాటు చేసిందన్నారు. ఈ ప్రాంతానికి ఉండే ప్రత్యేక బలాలు, సహజ వనరులు, పరిశ్రమలకు అనుకూల పరిస్థితులను పరిగణలోకి తీసుకుని తిరుపతి ఎకనామిక్ రీజియన్ అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఓర్వకల్లు నోడ్‌లో పరిశ్రమల స్థాపన, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, ఎంఎ్‌సఎంఈలు, నీటి పారుదల ప్రాజెక్టులు, పరిశ్రమల ఏర్పాటుకు నీటి సరఫరా తదితర అంశాలపై జిల్లా స్థాయి అధికారులతో సమీక్షించారు. జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్, అర్ అండ్ బీ ఎస్‌ఈ మహేఽశ్వరరెడ్డి, ఇండిస్ట్రీస్ జీఎం అశోక్ కుమార్, ఏపీఐఐసీ అధికారి సంపత్ , ఎయిర్‌పోర్టు డైరెక్టర్ విద్యా సాగర్, సీపీఓ భారతి, ఏపీఎస్పీడీసీఎల్ ఎస్‌ఈ ప్రదీప్, డీడీ మైన్ ్స నాగిని పాల్గొన్నారు.