‘వీబీ- జీరామ్‌జీ’తో భరోసా
ABN , Publish Date - Jul 02 , 2026 | 11:28 PM
కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ స్థానంలో కొత్తగా అమలులోకి తెచ్చిన వీబీజీ-రామ్‌జీ పథకంలో ఉపాధికి భరోసా లభించనుంది
పెరగనున్న బాధ్యత
వేతనాల కోసం ఎదురుచూపులకు ఇక స్వస్తి
15 రోజులకోసారి వేతన చెల్లింపులు
హర్షం వ్యక్తం చేస్తున్న కూలీలు
కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ స్థానంలో కొత్తగా అమలులోకి తెచ్చిన వీబీజీ-రామ్‌జీ పథకంలో ఉపాధికి భరోసా లభించనుంది. పనుల ఖర్చుకు సంబంధించి రాష్ట్ర వాటా 40 శాతానికి పెంచడంతో ఇకపై రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల బాధ్యత కూడా పెరిగి.. పనుల్లో నాణ్యత కల్పించ నుంది. వేతనాలకు ఎదురు చూపులు ఉండవు. కచ్చితంగా 15 రోజులకోసారి వేతనాలు చెల్లించాల్సిందే. లేకపోతే వడ్డీని ఉపాధి కూలీల బ్యాంకు ఖాతాలకు జమ చేస్తారు. కొత్త పథకాన్ని అమలు చేస్తున్న సందర్భంలో కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ కూలీలకు ప్రస్తుతం చెల్లిస్తున్న రోజుకు రూ.307కు అదనంగా మరో రూ.5 పెంచుతూ బుధవారం నిర్ణయం తీసుకోవడంతో కూలీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కర్నూలు అగ్రికల్చర్, జూలై 2 (ఆంధ్రజ్యోతి):పనుల కోసం వ్యవసాయ కూలీలు రోజుల తరబడి కార్యాలయాల చుట్టూ వేచి చూడాల్సిన పని, తిరగాల్సిన అవసరం ఉండదు. దరఖాస్తు చేసిన 15 రోజుల్లోగా వారికి తప్పనిసరిగా పని కల్పిం చాలి. లేకపోతే కొంత మేర నిరుద్యోగ భృతిని అందించేందుకు కేంద్ర ప్రభుత్వం మార్గదర్శ కాల్లో పేర్కొంది. ‘వీబీజీ-రామ్‌జీ’ (వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అజీవిక మిషన్ గ్రామీణ్) ద్వారా వ్యవసాయ కూలీల కు అదనపు ప్రయో జనాలు కల్పించబడ టమే కాకుండా గ్రామాల్లో మౌలిక వసతులు మెరుగు పడనున్నాయి. ఈ పథకంతో ఉమ్మడి జిల్లాలో ఏటా దాదాపు రూ.500 నుంచి రూ.600 కోట్ల దాకా ఖర్చు చేసి వ్యవసాయ కూలీలకు ఉపాధి కల్పించ నున్నారు. కర్నూలు జిల్లాలో 484 గ్రామ పంచాయతీలు, నంద్యాల జిల్లాలో 489 గ్రామ పంచాయతీల్లో గురువారం నుంచి ఈ పథకం లాంఛనంగా ప్రారంభమైంది.
జిల్లా నీటి యాజమాన్య సంస్థ జాబ్‌కార్డులను..
‘వీబీజీ-రామ్‌జీ’లో కర్నూలు జిల్లాలో 3.12 లక్షల మంది, నంద్యాల జిల్లాలో 3.11 లక్షల మంది వ్యవసాయ కూలీలకు జిల్లా నీటి యాజమాన్య సంస్థ జాబ్ కార్డులను అందజేసింది. ఈరెండు జిల్లాలో గత సంవత్సరం రూ.500కోట్లను ఖర్చు చేశారు. కర్నూలు జిల్లాలో రూ.136.23 కోట్ల వేతనాలు, నంద్యాల జిల్లాలో రూ.134.16 కోట్ల వేతనాలను వ్యవ సాయ కూలీలకు చెల్లించారు. కర్నూలు జిల్లాలో రూ.45 కోట్లు ఖర్చు చేసి మౌలిక వసతులను గ్రామాల్లో కల్పించారు. నంద్యాల జిల్లాలో రూ.42 కోట్లు వసతి సౌకర్యాలకు ఖర్చు చేశారు.
పాత విధానంలో నెలకోసారి..
నెల రోజులకు ఒకసారి కూడా పాత విధా నంలో వేతనాలు చెల్లించేవారు కాదు. రెండు, మూడు నెలలు జాప్యం చేస్తుండటంతో ఈ పనులపై గ్రామాల్లో ఆసక్తి తగ్గి ఇతర ప్రాంతా లకు వలస వెళ్తే పరిస్థితి దాపురించింది. కొత్తగా అమలులోకి తెచ్చిన పథకం వల్ల తప్పనిసరిగా ఇకపై 15 రోజులకు ఒకసారి వేతనాలు చెల్లించాలని, ఆలస్యమైతే వడ్డీని జమ చేయాలని షరతు విధించారు. దీని వల్ల వ్యవసాయ కూలీలకు ఉపాధి పనులు చేసేందుకు ఆసక్తి పెరగనుంది.
కొత్త పథకంలో 318 పనులకు స్థానం
కొత్తగా అమలులోకి తెచ్చిన పథకంలో ప్రధానంగా 318 రకాల పనులకు స్థానం కల్పించింది. కర్నూలు జిల్లాలోని 484 పంచాయతీలు, నంద్యాల జిల్లాలోని 489 గ్రామ పంచాయతీల్లో ముఖ్యమైన భవనాలు పశుకేంద్ర కేంద్రాలు, ఆరోగ్య కేంద్రాలు, గ్రామ పంచాయతీ భవనాలు, అంగన్ వాడీ కేంద్రాలు, శ్మశాన వాటికలు, కల్యాణ మండపాలు, సంతలు, పాఠశాలల భవనాలు, ఏర్పాటు చేయనున్నారు. నీటి సంరక్షణకు సంబంధించి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. గ్రామ స్థాయిలో 318 రకాల పనులు చేపట్టి మౌలిక వసతుల కల్పనతో పాటు నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచడం, శాశ్వత పనుల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నారు.
కొత్త పథకంలో 60: 40 శాతం
పాత పథకంలో గ్రామాల్లో చేపట్టే పనులకు సంబం ధించి కేంద్రం 90, రాష్ట్రం 10 శాతం మాత్రమే వేతనా లకు గానూ భరించేది. ఈ పరిస్థితిని పూర్తిగా మార్చే సేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు గ్రామాల్లో పనుల నాణ్యతను పరిరక్షించేందు కోసమని కేంద్ర ప్రభుత్వం ఇకపై జరిగే పనుల్లో 60 శాతం నిధులు మాత్రమే తాము అందిస్తామని, మిగిలిన 40 శాతం నిధులు రాష్ట్ర ప్రభుత్వాలే భరించాలని నిర్ణయించింది. 60:40 శాతం నిధులతో పనులు సాగనున్నాయి. రాష్ట్రప్రభుత్వ ఆదేశా లతో గ్రామస్థాయి నుంచి జిల్లాస్థాయి అధికారులు, సిబ్బం ది పనులపై మరింత బాధ్యతతో తనిఖీలు చేపట్టే అవకాశం ఏర్పడింది.
వ్యవసాయ కూలీలకు ఆర్థిక భద్రత
‘వీబీజీ-రామ్‌జీ’తో వ్యవసా య కూలీలకు ఆర్థిక భరోసా కల్పిం చ బడింది. గ్రామాల్లో శాశ్వత మౌలి క వసతులు కల్పిస్తాం. నిధుల ఖ ర్చుకు సంబంఽధించి రాష్ట్ర ప్రభుత్వ వాటా పెరగడం వల్ల బాధ్యతతో పాటు నాణ్యతకు ప్రాధాన్యత కల్పిస్తాం.
నరసింహారెడ్డి, పీడీ, డ్వామా, కర్నూలు