సీమ ప్రాజెక్టుల కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధం
ABN , Publish Date - Jan 11 , 2026 | 12:02 AM
రాయలసీమ ప్రాజెక్టుల కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధంగా ఉన్నామని రాయలసీమ రాష్ట్ర సమితి వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కుంచం వెంకట సుబ్బారెడ్డి అన్నారు.
రాయలసీమ రాష్ట్ర సమితి జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కుంచం వెంకట సుబ్బారెడ్డి
ఆళ్లగడ్డ జనవరి 10 (ఆంధ్రజ్యోతి): రాయలసీమ ప్రాజెక్టుల కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధంగా ఉన్నామని రాయలసీమ రాష్ట్ర సమితి వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కుంచం వెంకట సుబ్బారెడ్డి అన్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పీకను నొక్కేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఆరోపించారు. శనివారం ఆళ్లగడ్డ ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టుపై చేసిన కామెంట్స్‌తో ఏపీ రాజకీయం అట్టుడికిపోతోందన్నారు. రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టును ఆపివేయడం అన్యాయమని అన్నారు. రాయలజీమ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు తమ ప్రజల కోసం రాజీనామాలు చేసి బయటకు వచ్చి లిఫ్ట్ ప్రాజెక్టు కోసం పోరాడాలని పిలుపు నిచ్చారు. ఈ సమావేశంలో రైతు సంఘం నాయకులు రామకృష్ణారెడ్డి, సగలి చిన్న వెంకటసుబ్బారెడ్డి, రాష్ట్ర మైనార్టీ నాయకులు సాదర్ వలి, ముష్కిల్‌వలి తదితరులు పాల్గొన్నారు.