ప్రణాళికలు సిద్ధం చేయాలి
ABN , Publish Date - May 15 , 2026 | 11:38 PM
పొదుపు మహిళల అభివృద్ధికి సంబంధించి వార్షిక ప్రణాళికలను పక్కాగా సిద్ధం చేయాలని వెలుగు జిల్లా ప్రాజెక్టు మేనేజర్ హనుమనాయక్ తెలిపారు. శక్రవారం వెలుగు కార్యాలయంలో వీవోఏలతో సమావేశమయ్యారు.
ఉయ్యాలవాడ, మే 15(ఆంధ్రజ్యోతి): పొదుపు మహిళల అభివృద్ధికి సంబంధించి వార్షిక ప్రణాళికలను పక్కాగా సిద్ధం చేయాలని వెలుగు జిల్లా ప్రాజెక్టు మేనేజర్ హనుమనాయక్ తెలిపారు. శక్రవారం వెలుగు కార్యాలయంలో వీవోఏలతో సమావేశమయ్యారు. 2026-27కు సంబంధించి ఆర్థికాభివృద్ధి, జీవనోపాదుల పెంపుదలే లక్ష్యంగా పనిచేయాలన్నారు. ప్రతి మహిళా పారిశ్రామికంగా ఎదిగేలా ఒక్కో సంఘానికి రూ.10లక్షల నుంచి రూ.20లక్షల వరకు రుణాలు అందిస్తామన్నారు. స్ర్తీ నిధి, సీఐఎఫ్ కింద తక్కువ వడ్డీతో రూ. 50 వేల నుంచి రూ.లక్ష వరకు రుణాలు అందింస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీ మహిళలకు ఉన్నతి ద్వారా సున్నా వడ్డీతో రుణాలు అందిస్తామని ఆయన తెలిపారు. రంగారావు, సీసీ గంగన్న, రంగస్వామి ఉన్నారు.