Share News

సమరానికి సై

ABN , Publish Date - Nov 12 , 2026 | 11:24 PM

జిల్లాలో పంచాయతీ పోరుకు సర్వం సిద్ధం చేశారు.

సమరానికి సై

ఏర్పాట్లలో అధికారులు నిమగ్నం

అభ్యర్థుల ఎంపికపై కసరత్తులో పార్టీలు

ఏకగ్రీవాలపై ఇరుపార్టీల్లో ఉత్కంఠ

కూటమి నాయకుల్లో జోష్‌

నేడు పల్లె పోరుకు నోటిఫికేషన్‌

జిల్లాలో పంచాయతీ పోరుకు సర్వం సిద్ధం చేశారు. జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లలో నిమగ్నమ య్యారు. ఇదే క్రమంలో ఇటు కూటమి అటు వైసీపీ ఎక్కడికక్కడ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు మొదలెట్టాయి. తాజా పుర, పరిషత్‌ పోరు ఫలితాలతో కూటమి నేతలు జోష్‌తో ముందు కెళ్తున్నారు. మూడు విడతల్లో పంచాయతీ పోరు నిర్వహించనున్నారు. శుక్రవారం పంచాయతీ పోరు నోటిఫికేషన్‌ విడుదల కానుండటంతో జిల్లాలో రాజకీయం మరింత వేడెక్కనుంది. ఏది ఏమైనా ఏకగ్రీవాల వ్యవహారంపై ఏం జరుగుతుందో? అని ఇరుపార్టీలతో పాటు రాజకీయ వర్గాలు, ప్రజలు, ఆశావహుల్లో ఉత్కంఠ మొదలైంది.

నంద్యాల, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): పల్లెల్లో పంచాయతీ ఎన్నికలకు అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నా రు. పార్టీలు కూడా అభ్యర్థుల ఎంపికపై కసరత్తు మొదలు పెట్టారు. ఇటీవలే జరిగిన మున్సిపల్‌, పరిషత్‌ ఎన్నికల్లో విజయం సాధించడంతో కూటమి నాయకుల్లో జోష్‌ నెలకొంది. వైసీపీ కూడా పల్లె పోరులో కొంత సత్తా చాటాలని ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. వార్డుల వారీగా రిజర్వేషన్ల కూడా ఖరారయ్యాయి. మూడు విడతల్లో పంచాయతీ పోరు నిర్వహించనున్నారు. పల్లె పోరు జిల్లాలో ఇరుపార్టీల పరంగా ఊపందుకుంది. రాజకీయం ఒక్కసారిగా వేడెక్కనుంది.

489 పంచాయతీల్లో..

పంచాయతీ ఎన్నికలకు సంబంధించి శుక్రవారం నోటిఫికేషన్‌ విడుదల కా నుంది. ఇప్పటికే జిల్లాలోని 28 మండలాల్లో 489 పంచాయతీల్లో(సున్నిపెంటతో కలిపి) 489 సర్పంచ్‌, 4920వార్డు సభ్యుల స్థానాల పరంగా ఎన్నికలను మూడు విడతల్లో నిర్వహిస్తారు. రిజర్వేషన్ల పరంగా ఇటు ఆశావహులు.. అటు రాజకీయ పార్టీల నేతలు, నాయకులు అభ్యర్థుల ఎంపిక ప్రారంభించారు.

పలు కోణాల్లో ఏకగ్రీవాలపై..

జిల్లాలోని చాలా మండలాల్లో కూ టమి.. వైసీపీ నేతలతో పాటు కీలక నాయకులందరూ కలిసి ఎక్కడికక్కడ అభ్యర్థుల ఎంపికతో పాటు సర్పంచ్‌ స్థానాల ఏకగ్రీవాలపై దృష్టిపెట్టినట్లు సమాచారం. పుర, పరిషత్‌ పోరు ఏకగ్రీవాలతో ఆయా పార్టీల అధిష్ఠానాల నుంచి కొందరు నాయకులను మందలించినట్లు ప్రచారం ఉంది. పైగా పార్టీ గుర్తులు కూడా ఉండవు. ఈ క్రమంలో ఏకగ్రీవాల సంఖ్య కూడా అంతంత మా త్రంగా ఉండేలా అనిపిస్తోంది. జిల్లావ్యాప్తంగా 20 నుంచి 30శాతం సర్పంచ్‌ స్థానాలు ఏకగ్రీవమ య్యే అవకాశం లేకపోలేదు. ఏకగ్రీవాల వ్యవహారంపై ఏం జరుగుతుందో? అని స ర్వత్రా ఉత్కంఠ మొదలైంది. బనగానపల్లెలో మాత్రమే ఎక్కువగా ఏకగ్రీవాలయ్యే అవకాశముందని తెలుస్తోంది.

మండల నాయకులపైనే..

సర్పంచ్‌ అభ్యర్థుల ఎంపిక ఆయా మండల నా యకులపైనే పార్టీలు ఎక్కువశాతం ఆధారపడే అవకాశముంది. ప్రజాప్రతినిధుల కంటే ఎక్కువ శాతం క్షేత్రస్థాయిలో మండల నాయకులకే పార్టీ బలబలాలపై అవగాహన ఉంటుంది. ఈ లెక్కన పల్లె పోరులో మండల నాయకులదే కీలక పాత్ర. కొన్నిచోట్ల కూటమి పార్టీల్లోని నాయకుల వర్గపోరును అదునుగా భావించి సర్పంచ్‌ స్థానాలు ఎక్కువగా కొట్టేయాలని వైసీపీ భావిస్తున్నట్లు సమాచారం. పంచాయతీ ఎన్నికల్లోనైనా కూటమి నేతలు కలిసి కట్టుగా ఉండి ఎక్కువ స్థానాల్లో సర్పంచ్‌లు గెలిచేలా ప్రయత్నాలు చేయాల్సిన అవసరముంది.

అందరూ సహకరించాలి

సున్నిపెంట పంచాయతీతో కలిపి మొత్తంగా 489 సర్పంచ్‌, 4,920 వార్డు సభ్యుల పరంగా పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే 5,085 పోలింగ్‌ కేంద్రాల్లో నిఘాతో పాటు ఏర్పాట్లుచేశాం. రాజకీయ పార్టీలతో పాటు అభ్యర్థులు, ప్రజలందరూ ఎన్నికలకు సహకరించాలి. అధికారులు కూడా సమన్వయంతో పనిచేయాలి.

రాజకుమారి, కలెక్టర్‌, నంద్యాల

జిల్లాలో పరిస్థితి..

పంచాయతీలు : 489

వార్డులు : 4,920

మొత్తం ఓటర్లు : 10,76,485

పురుషులు : 5,28,990

మహిళలు : 5,47,373

ఇతరులు : 122

పోలింగ్‌ కేంద్రాలు : 5085

Updated Date - Nov 12 , 2026 | 11:24 PM